Justice For Koratala Shiva: కొరటాల శివ సెటిల్మెంట్ వ్యవహారం ఏంటి.. అసలు ఏమి జరిగిందంటే?

Justice for Koratala Shiva: ఆచార్య సినిమా డిజాస్టర్ నేపథ్యంలో కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్మెంట్లు చేస్తున్నారని గత రెండు మూడు నెలల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఒక దర్శకుడు సెటిల్మెంట్ వ్యవహారం ఎందుకు చేస్తున్నారనే విషయం మీద చర్చ జరిగింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2022, 02:57 PM IST
  • అనూహ్యంగా వార్తల్లోకి కొరటాల శివ
  • సెటిల్మెంట్ చేస్తున్నారంటూ ప్రచారం
  • జస్టిస్ ఫర్ కొరటాల శివ అంటూ ట్రేండింగ్
Justice For Koratala Shiva: కొరటాల శివ సెటిల్మెంట్ వ్యవహారం ఏంటి.. అసలు ఏమి జరిగిందంటే?

Justice for Koratala Shiva Trending in Twitter: దర్శకుడు కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో సూపర్ హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ కాంబినేషన్లో చేసిన ఆచార్య సినిమాతో మాత్రం డిజాస్టర్ మూట కట్టుకున్నారు. ఈ డిజాస్టర్ నేపథ్యంలో ఆయన డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్మెంట్లు చేస్తున్నారని గత రెండు మూడు నెలల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఒక దర్శకుడు సెటిల్మెంట్ వ్యవహారం ఎందుకు చేస్తున్నారనే విషయం మీద చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా కొంతమంది బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఆయన ఆఫీసుకు వెళ్లి తమ సంగతి తేల్చమని అది తేలేవరకు కదిలేదు లేదంటూ భైఠాయించినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ సినిమాల్లో ఎవరు డబ్బులు పెట్టారు కొరటాల శివ ఎందుకు వారితో సంప్రదింపులు జరుపుతున్నారనే చర్చ జరుగుతోంది.

అయితే తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో ముందు కొణిదెల ప్రొడక్షన్స్ అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మించాలని భావించాయి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ రెమ్యూనరేషన్ నే తమ ప్రొడక్షన్ వాటాగా పెట్టుకున్నారట. అంటే రామ్ చరణ్ తేజ చిరంజీవి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటిస్తారు సినిమా అమ్ముడుపోయిన తర్వాత లాభాల్లో వచ్చే వాటాలు తీసుకుంటారు. కానీ సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత కొరటాల శివ ఏమనుకున్నారో ఏమో నిరంజన్ రెడ్డి వద్ద తాను ఈ సినిమా రిలీజ్ చేసుకుంటానని సినిమా నిర్మించినందుకు మీరు పెట్టిన డబ్బులు ఇచ్చేసి దానికి పైగా ఒక నాలుగు కోట్ల రూపాయలు ఇస్తానని అన్నారుట. దానికి ఆయన ఒప్పుకోవడంతో నిరంజన్ రెడ్డి కూడా నాలుగు కోట్ల రూపాయలు అదనంగా తీసుకుని సినిమా హక్కులు కొరటాల శివకు రాసిచ్చారు.

అయితే ఈ విషయాలు బయటకు రానీయకుండా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా తామే నిర్మాతలు అన్నట్టు నిరంజన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడారు. నిరంజన్ రెడ్డి కొరటాల శివకు సినిమా అమ్మేశారని విషయం తెలుసుకున్న చిరంజీవి, రామ్ చరణ్ కూడా తమ రెమ్యూనరేషన్ 50 కోట్ల రూపాయలని చెప్పడంతో అందులో 30 కోట్ల రూపాయలు ముందే కొరటాల శివ చెల్లించారు. ఇలా నిరంజన్ రెడ్డికి డబ్బులు ఇవ్వడం, అలాగే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ లకు డబ్బులు ఇవ్వడం కోసం తాను సంపాదించిన డబ్బు అంతా పెట్టి కొరటాల శివ చెల్లింపులు చేశారు. సినిమా విడుదలైన డిజాస్టర్ టాక్ రావడంతో కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం తెలుసుకొని కొంతమేర డబ్బు సర్దుబాటు చేయడంతో ఈ విషయం మిగతా ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లకు కూడా తెలిసింది.

వాళ్లకు సర్దుబాటు చేశారు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మేము కూడా నష్టపోయాం మా సంగతి తేల్చండి అంటూ ఆయన ఆఫీసు ముందు కూర్చున్నారట. ఇలా అయితే తన పరువు పోతుందని భావించిన కొరటాల శివ ఎట్టకేలకు తనకు హైదరాబాద్ లో ఒక రిచ్ ఏరియాలో ఉన్న ప్లాట్ అమ్మి ఆ డబ్బుతో సెటిల్మెంట్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ ఫ్లాట్ ఖరీదు 40 నుంచి 45 కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమస్యలు అన్నీ క్లియర్ చేసుకుంటే తాను చేయబోయే ఎన్టీఆర్ 30వ సినిమాకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని కొరటాల భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇవేవీ తెలియని నెటిజన్లు మాత్రం జస్టిస్ ఫర్ కొరటాల శివ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Read Also: Malavika Mohanan: పొట్టి గౌనులో మాళవిక థైస్ షో.. బెడ్డెక్కి మరీ ఘాటు ముద్దులు!

Read Also: The Warriorr Twitter Review: రామ్ పోతినేని-కృతి శెట్టిల 'ది వారియర్' సినిమా ఎలా ఉందంటే?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News