The Warriorr Twitter Review: రామ్ పోతినేని-కృతి శెట్టిల 'ది వారియర్' సినిమా ఎలా ఉందంటే?

The Warriorr Movie Twitter Review: ప్రపంచ వ్యాప్తంగా ది వారియర్ సినిమా జూలై 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకును ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2022, 01:15 PM IST
  • రామ్ హీరోగా ది వారియర్
  • 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన
 The Warriorr Twitter Review: రామ్ పోతినేని-కృతి శెట్టిల 'ది వారియర్' సినిమా ఎలా ఉందంటే?

The Warriorr Movie Twitter Review: రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ది వారియర్. రామ్ కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం, క్రేజీ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమా మీద విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్లు, టీజర్ సినిమా మీద అంచనాలను అంతకంతకూ పెంచేయడంతో సినిమా మీద ఆసక్తి నెలకొంది. 

ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా ది వారియర్ సినిమా జూలై 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిమ్రించిన ఈ సినిమా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హక్కులు 43. 10 కోట్లకు అమ్ముడయ్యాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకులకును ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ట్విట్టర్ రివ్యూ లో చూద్దాం.

శరత్ అనే ఒక నెటిజన్ ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ బావుందని అన్నారు.  రామ్, ఆది, సినిమాలో పాటలు, ఇంటర్వెల్ సినిమాకి పాజిటివ్స్ అని చెప్పుకొచ్చాడు. విలన్ గా ఆది చాలా అద్భుతంగా నటించాడని, అయితే సెకండ్ హాఫ్ బావుండాలని అనుకుంటాం కానీ రొటీన్ గా సాగిపోతుంది అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ స్లోగా హౌస్ హోల్ అవుతున్నాయి మాస్ సెలబ్రేషన్స్ చూస్తారు ఈరోజు అంటూ కామెంట్ చేశారు.

ఇక లోకనాథ్ రెడ్డి అనే మరో నెటిజన్ కూడా ఈ సినిమా సూపర్ ఎనర్జీ మాస్ మూవీ అని చెప్పుకొచ్చారు. ఇస్మార్ట్ శంకర్ లాగానే ఈ సినిమాలో డ్యాన్స్, ఫైట్స్ కూడా అద్భుతంగా కుదిరాయని, లాజికల్ గా సినిమా నమ్మే విధంగా ఉందని కామెంట్ చేశారు. అలాగే రామ్ కి థాంక్స్ చెప్పిన సదరు నెటిజన్ కృతి శెట్టి అద్భుతంగా నటించిందని, ఆమె అందంగా కనిపించింది అని చెప్పుకొచ్చారు. ఇక విలన్ పాత్రలో ఆది పినిశెట్టి స్లాంగ్ వేరుగా ఉందని,  ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ అని కామెంట్ చేశారు.

Also Read: The Warriorr: ది వారియర్ కు వరుణ గండం.. హైద్రాబాద్లో మరీ దారుణంగా అమ్మకాలు.. ఇలా అయితే కష్టమే!

Also Read: Dil Raju: కొడుక్కి ఆసక్తికరమైన పేరు పెట్టిన దిల్ రాజు.. ఇద్దరి భార్యల పేర్లు కలిసేలా ఏమి పెట్టారంటే

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News