Baahubali in masks: మాస్కుల్లో బాహుబలి, భల్లాలదేవ వీడియో

Baahubali in masks: కరోనావైరస్ సంక్రమణ ( Coronavirus ) నుంచి దూరంగా ఉండాలంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.  ప్రజల్లో కరోనాపై అవగాహన ( Coronavirus awareness ) కల్పిండానికి సెలబ్రిటీలు కూడా ముందుంటున్నారు. అందులో రాజమౌళి ( SS Rajamouli ) స్టేలే వేరు.

Last Updated : Jun 27, 2020, 11:25 AM IST
Baahubali in masks: మాస్కుల్లో బాహుబలి, భల్లాలదేవ వీడియో

Baahubali in masks: కరోనావైరస్ సంక్రమణ ( Coronavirus ) నుంచి దూరంగా ఉండాలంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.  ప్రజల్లో కరోనాపై అవగాహన ( Coronavirus awareness ) కల్పిండానికి సెలబ్రిటీలు కూడా ముందుంటున్నారు. అందులో రాజమౌళి ( SS Rajamouli ) స్టేలే వేరు. 

బాహుబలి  ( Bahubali ) సినిమాతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమ ( TFI ) పేరు ప్రతిష్టతలను పెంచిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు సేఫ్‌గా ఉండాలి అంటూ ఇటీవలే స్టే సేఫ్ అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించిన డైరెక్టర్ రాజమౌళి.. అందులో భాగంగానే తాజాగా ఒక ట్వీట్ చేశాడు.

బాహుబలి-2లో ( Bahubali 2 ) క్లైమాక్స్‌లో బాహుబలి - భల్లాల దేవ మధ్య జరిగే ఫేస్ టు ఫేస్ ఫైట్ సన్నివేశంలో ఇద్దరు ఒకరికొకరు సవాల్‌కి ప్రతి సవాల్ చేసుకునే సన్నివేశాన్ని అందరం చూసి ఎంజాయ్ చేశాం. సరిగ్గా అదే సన్నివేశంలో బాహుబలి - భల్లాల దేవ మాస్కులు ధరిస్తే ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియోను షేర్ చేసిన రాజమౌళి.. కరోనా నివారణ కోసం మాహిష్మతిలోనైనా మాస్కులు తప్పనిసరేననే సందేశాన్ని ఇచ్చారు. ఈ వీడియో షేర్ చేసిన రాజమౌళి  ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాయామాలు చేయండి అంటూ సందేశాన్నిచ్చాడు.

రాజమౌళి చేసిన ఈ ట్వీట్‌కు నెటిజెన్స్ నుంచి భారీ స్పందన కనిపించింది. మాహిష్మతిలో మాస్కులు అంటూ నెటిజెన్స్ చమత్కరిస్తున్నారు. బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి, రామ్ చరణ్ (  Ram Charan ), జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR ) కాంబినేషన్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ ( RRR movie )  తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియెన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Trending News