తెలుగులో 'సలాం రాకీ భాయ్' లిరికల్ సాంగ్ విడుదల

సలాం రాకీ భాయ్ సాంగ్ విడుదల

Last Updated : Dec 4, 2018, 09:27 PM IST
తెలుగులో 'సలాం రాకీ భాయ్' లిరికల్ సాంగ్ విడుదల

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన సలాం రాకీ భాయ్ లిరికల్ సాంగ్ ఈరోజే ఆడియెన్స్ ముందుకొచ్చింది. నవంబర్‌ 9న రిలీజైన కేజీఎఫ్ తెలుగు ట్రైలర్‌కి భారీ స్పందన లభించగా ఇవాళ విడుదలైన ఈ పాటకు సైతం మంచి స్పందనే కనిపిస్తోంది. కన్నడలో రూపొందిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మళయాళం భాషల్లోనూ విడుదలవనుంది. ప్రశాంత్ నీల్ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ సమర్పించగా, వారాహి చలన చిత్రం బ్యానర్ తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తుంది.

కోలార్ గోల్ ఫీల్డ్స్ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా నేపథ్యం విషయానికొస్తే, 1951లో ముంబై వీధుల్లో పుట్టిన రాకీ అనే కుర్రాడు నేరాలు చేస్తూ పెరిగి పెద్దవుతాడు. ఆ తర్వాత తన పనిలో భాగంగా ఓసారి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌కి వెళ్తాడు. అక్కడ అతడికి ఎదురైన అనుభవాలు, సవాళ్లు.. అంతకన్నా ముందుగా చిన్నప్పటి నుంచి అతడు నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా ఆ సమస్యలను ఎదుర్కున్న యుద్ధమే ఈ కేజీఎఫ్ సినిమా కథాంశం. యశ్ అనే కన్నడ నటుడు రాకీ పాత్ర పోషించగా శ్రీనిధి అతడి సరసన జంటగా నటించింది.

Trending News