సంజయ్ దత్ బయోపిక్ టీజర్ విడుదల

బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ జీవితకథ ఆధారం ఓ బయోపిక్‌ చిత్రం నిర్మితమవుతోంది. 

Last Updated : Apr 24, 2018, 05:32 PM IST
సంజయ్ దత్ బయోపిక్ టీజర్ విడుదల

బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ జీవితకథ ఆధారం ఓ బయోపిక్‌ చిత్రం నిర్మితమవుతోంది. మున్నాభాయ్ ఎంబిబిఎస్, త్రీ ఇడియట్స్ చిత్రాల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రలో నటుడు రణ్‌బీర్ కపూర్ నటించడం విశేషం. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన తొలి టీజర్‌‌ను విడుదల చేశారు.

ఈ సినిమాకి "సంజూ" అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టీజర్‌లో నటుడు రణ్‌బీర్ కపూర్ అచ్చం సంజయ్‌‌దత్‌లాగే కన్పిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్‌దత్ తల్లి పాత్రలో ప్రముఖ నటి మనీషా కొయిరాల నటించడం విశేషం. అలాగే దియా మీర్జా, సోనమ కపూర్, అనుష్క శర్మ ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జూన్ 2018లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

1993 ముంబయి బాంబుపేలుళ్ల కేసులో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నారన్న నేరంపై కోర్టు సంజయ్‌దత్‌కు అయిదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జైలు శిక్ష అనుభవించిన సంజయ్ ఎనిమిది నెలల శిక్ష మిగిలి ఉండగానే సత్ప్రవర్తన వల్ల విడుదలయ్యారు. అయితే  పెరోల్ పై సంజయ్‌దత్‌ను విడుదల చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 

Trending News