Pushpa story: 'పుష్ప కథ కాపీ' ఆరోపణలపై సుకుమార్ వెర్షన్

ఇటీవల కాలంలో పలు భారీ ప్రాజెక్టులపై కాపీ ఆరోపణలు రావడం సర్వసాధారణంగా మారింది. కొరటాల శివ ( Koratala Siva ) డైరెక్ట్ చేస్తున్న ఆచార్య మూవీ స్టోరీ సైతం తన కథ నుంచి కాపీ చేసిందేనని రాజేష్ అనే వ్యక్తి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Last Updated : Aug 29, 2020, 12:22 AM IST
Pushpa story: 'పుష్ప కథ కాపీ' ఆరోపణలపై సుకుమార్ వెర్షన్

ఇటీవల కాలంలో పలు భారీ ప్రాజెక్టులపై కాపీ ఆరోపణలు రావడం సర్వసాధారణంగా మారింది. కొరటాల శివ ( Koratala Siva ) డైరెక్ట్ చేస్తున్న ఆచార్య మూవీ స్టోరీ ( Acharya movie story ) సైతం తన కథ నుంచి కాపీ చేసిందేనని రాజేష్ అనే వ్యక్తి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలను ఖండిస్తూ దర్శకుడు కొరటాల శివ, చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వేర్వేరుగా ప్రెస్ నోట్ కూడా విడుదల చేసి ఆ ఆరోపణలను ఖండించారు. Also read : Pushpa movie: నా కథను కాపీ కొట్టారంటూ సుకుమార్‌పై ప్రముఖ రచయిత ఆరోపణలు

అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రం ( Allu Arjun's Pushpa ) కూడా ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కుంటోంది. డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాని తన రచనల ఆధారంగా రూపొందించారని, తన రచనలను కాపీ చేశాడని డా వేంపల్లి గంగాధర్ ( Dr Vempalli Gangadhar ) అనే ప్రముఖ రచయిత ఆరోపించారు. వేంపల్లి గంగాధర్ చేసిన ఆరోపణలతో పుష్ప సినిమా స్క్రిప్టు అంశం టాలివుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఐతే, ఈ ఆరోపణలపై స్పందించడం సుకుమార్‌కి ఏ మాత్రం ఇష్టం లేదు అని తెలుస్తోంది. Also read : Prabhas, Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ హీరోలుగా మల్టీస్టారర్

పుష్ప కథకు, గంగాధర్ రచనలు చదివినప్పుడు అతని కథలకు ఎలాంటి సంబంధం లేదని అనిపించినట్టు సుకుమార్ ( Director Sukumar ) తన సన్నిహితులకు వెల్లడించారని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి ఆరోపణలపై స్పందించడం వల్ల అవతల పార్టీకి ప్రచారం కల్పించినట్లవుతుంది అనే ఉద్దేశంతోనే సుకుమార్ ఈ వివాదంపై  స్పందించడం లేదని ఆయన సన్నిహితమిత్రులు చెబుతున్నారు. Also read : Chiranjeevi: చిరు పాటతో ఆయన్నే ఇంప్రెస్ చేసిన నటుడు

Also read : Vakeel Saab updates: వకీల్ సాబ్ టీజర్‌కి సమానంగా మోషన్ పోస్టర్

Also read : Balakrishna vs Chiranjeevi: చిరు-బాలయ్య బాబు వివాదంపై తనదైన స్టైల్లో స్పందించిన మోహన్ బాబు

Also read : Anchor Pradeep: గ్యాంగ్ రేప్ కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్

Trending News