Anchor Pradeep: గ్యాంగ్ రేప్ కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్

Anchor Pradeep on gang rape case: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై యాంకర్ ప్రదీప్ మాచిరాజు తన యూ ట్యూబ్ చానెల్ ద్వారా స్పందించాడు. నిజానిజాలు తెలుసుకోకుండా వాళ్లకు వాళ్లే నిర్దారణ చేసుకొని తనపై ఆరోపణలు చేస్తూ, తన పేరు, ఫొటోలను వాడుకొని కథనాలు రాస్తూ ( Fake news ) సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న ( Social media trolls ) వారిపై మండిపడ్డాడు.

Last Updated : Aug 28, 2020, 08:08 AM IST
Anchor Pradeep: గ్యాంగ్ రేప్ కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్

Anchor Pradeep on gang rape case: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై యాంకర్ ప్రదీప్ మాచిరాజు తన యూ ట్యూబ్ చానెల్ ద్వారా స్పందించాడు. నిజానిజాలు తెలుసుకోకుండా వాళ్లకు వాళ్లే నిర్దారణ చేసుకొని తనపై ఆరోపణలు చేస్తూ, తన పేరు, ఫొటోలను వాడుకొని కథనాలు రాస్తూ ( Fake news ) సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న ( Social media trolls ) వారిపై మండిపడ్డాడు. నిజం ఎంటో తెలుసుకోకుండా, తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేస్తూ తనని మానసికంగా మానభంగం ( Mental torture ) చేస్తున్నారని, ఆ తప్పుడు వార్తలు చూసి తను కాని తన ఇంట్లో వాళ్లకి కాని ఏదైన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రదీప్ ఆవేదన వ్యక్తంచేశాడు. Also read : Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా పోలీస్ లవ్ స్టోరీ

ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది అని మొత్తం అన్ని ఆధారాలతో బయటకి తీస్తా అని, ఆ నిజం ఎంటో తెలియకముందే సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న కొన్ని న్యూస్ సైట్స్, యూ ట్యూబ్ చానెల్స్‌పై కూడా చట్టపరమైన చర్యలు ( Legal action ) తీసుకుంటానని  యాంకర్ ప్రదీప్ మాచిరాజు హెచ్చరించాడు. Also read : ఒక్కో ఎపిసోడ్‌కి 2 లక్షలు కావాలంటున్న హీరోయిన్

ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకపోయినా.. మెట్టు మెట్టు ఎక్కుకుంటూ వచ్చి జనాలను ఎంటర్టెయిన్ చేస్తున్నానని.. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం తప్ప తనకు వేరే ఏం తెలియదు అని యాంకర్ ప్రదీప్ తన ఆవేదనను ట్రోల్స్ చేసేవారి ముందు వెళ్లగక్కాడు. వీలైతే తోచినంత సహాయం చేస్తా కాని ఎవ్వరికి అన్యాయం చేయను అని తెలిపాడు. కాని నాపై ఇలాంటి నిందలు, ఆరోపణలు చేస్తుంటే నేనేం తప్పు చేశానా అని.. నా పేరును ఎందుకు ఇలా వాడుతున్నారు అని బాధనిపిస్తోందని వాపోయాడు. పైగా ఇలా తప్పుడు రాతలు రాయడం మొదటిసారి కాదని చెబుతూ గతంలోనూ పలు సందర్భాల్లో తనపై వచ్చిన తప్పుడు కథనాల గురించి యాంకర్ ప్రదీప్ ఈ వీడియోలో ఏకరువు పెట్టాడు. యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇంకా ఏమేం చెప్పాడో మీరే చూడండి. Also read : Bigg Boss Telugu 4: బిగ్ బాస్ 4 షో లాంచింగ్ డేట్ వచ్చేసింది

ఈ ఆరోపణలు చేస్తున్న సదరు వ్యక్తులకు, ఆ పేర్లకు వాళ్లు చెప్తున్న స్థలాలకు, యాంకర్ ప్రదీప్‌‌కి ఏలాంటి సంబందం లేదు అని ఈ వీడియో ద్వారా వెల్లడించాడు ( Anchor Pradeep condemns gang rape allegations ). అలాగే తన పేరును వాడినందుకు న్యాయం కోసం ఒంటరిగానైనా పోరాటం చేస్తాను అని తెలిపాడు. నిజం ఎంటో తెలిసే వరకు తప్పుడు వార్తలతో ఈ కేసును వేరే దారి మళ్లించొద్దు అని వేడుకున్న యాంకర్ ప్రదీప్... ఈ క్రమంలో తనకు అండగా నిలిచిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. Also read : ఓటిటిలో విడుదల కానున్న Anchor Sreemukhi సినిమా

Trending News