కూతురితో అమీర్ ఆటలు.. మండిపడ్డ నెటిజన్లు

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఎంత సరదాగా, హుందాగా ఉంటారో అందరికి తెలుసు.

Last Updated : May 31, 2018, 01:08 PM IST
కూతురితో అమీర్ ఆటలు.. మండిపడ్డ నెటిజన్లు

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఎంత సరదాగా, హుందాగా ఉంటారో అందరికి తెలుసు. బయట ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో.. అదే విధంగా తన ఫ్యామిలీతో కూడా ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేస్తుంటారు.

తాజాగా అమీర్ ఖాన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విమర్శల పాలవుతోంది.  తన కూతురు ఇరా ఖాన్(21)తో కలిసి సరదాగా ఆడుకుంటున్న ఫోటోను అమీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఇది చాలా అసభ్యకరంగా ఉందని పోస్ట్ చేయకుండా ఉండాల్సిందని పోస్టుపై చాలా కామెంట్స్ వస్తున్నాయి. ముస్లిం వర్గాల నుంచి తీవ్ర విమర్శలతో కూడిన కామెంట్స్ వస్తున్నాయి. రంజాన్ మాసంలో ఇరా ఖాన్ అలాంటి డ్రెస్‌లో వేసుకోవడంలో అర్థం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా ఈడొచ్చిన కూతురితో ఆ ఆటలేంటని అమీర్‌పై మండిపడుతున్నారు. మరికొందరు అమీర్‌కు మద్దతు నిలుస్తున్నారు. ఆ స్థానంలో కొడుకు ఉండి ఉంటే ఈ విధంగా మాట్లాడేవారా? అని కామెంట్ చేస్తున్నారు.

 

Trending News