5 Health Mistakes: 2021 నుంచి ఈ తప్పులు అసలు చేయవద్దు

 కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 ఏడాది అందరికీ ఒత్తిడితో గడిచిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సైతం కరోనాను మహమ్మారిగా పేర్కొంది అంటే వైరస్ తీవ్రత అంత ప్రమాదమని చెప్పవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ టీకాలు వేసేందుకు అంతా సిద్ధమైంది. 2021 ఏడాదిని కొత్త ఆశలతో ప్రారంభిద్దాం.

Written by - Shankar Dukanam | Last Updated : Dec 30, 2020, 08:32 PM IST
  • కరోనా కారణంగా 2020 ఏడాది అందరికీ ఒత్తిడితో గడిచిపోయింది
  • ప్రస్తుతం పలు దేశాలు కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నాయి
  • వచ్చే ఏడాది నుంచి ఈ ఆరోగ్య తప్పిదాలు అసలు చేయవద్దు
5 Health Mistakes: 2021 నుంచి ఈ తప్పులు అసలు చేయవద్దు

5 Health Mistakes: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 ఏడాది అందరికీ ఒత్తిడితో గడిచిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సైతం కరోనాను మహమ్మారిగా పేర్కొంది అంటే వైరస్ తీవ్రత అంత ప్రమాదమని చెప్పవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ టీకాలు వేసేందుకు అంతా సిద్ధమైంది. 2021 ఏడాదిని కొత్త ఆశలతో ప్రారంభిద్దాం.

COVID-19 మహమ్మారి మనకు చాలా ముఖ్యమైన పాఠాలను నేర్పింది. ఆరోగ్యంగా ఉండటం మరియు మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై అవగాహనా అందరిలోనూ పెరిగింది. వచ్చే ఏడాది నుంచి ఈ కింది విషయాలు రిపీట్ కాకుండా చూసుకోవడానికి యత్నించండి.

Also Read: Hot Water Benefits: వేడి నీళ్లు తాగుతున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా?

అల్పాహారం మానేయడం
అల్పాహారం తినేవారి కంటే మానేసేవారు అంతగా ఆరోగ్యంగా ఉండరని, సన్నగా ఉంటారని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అల్పాహారం తినేవారికి ఇతర ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్ దాటవేయడం వల్ల ఎక్కువ బరువు పెరుగుతారు, ఊబకాయం లాంటి అనేక దీర్ఘకాలిక సమస్యల బారిన పడొద్దంటే ప్రతిరోజు ఉదయం అల్పాహారం తీసుకోవాలి.

 

ఎక్కువ లేదా చాలా తక్కువ వ్యాయామం
వ్యాయామం మీ జీవనశైలిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండాలి, అయితే ఏ విషయాన్ని అతిగా చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల గాయాలు, అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం మరియు నిరాశ లాంటి వాటికి దారితీస్తుంది. తద్వారా అసాధారణ హార్మోన్ల మార్పులు మరియు శాశ్వత శారీరక సమస్యల్ని కూడా కలిగిస్తుంది. అసలు వ్యాయామం చేయకపోయినా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని గుర్తుంచుకోండి.

Also Read: Job Tips: మీరు ఇలా చేస్తున్నారా.. అయితే జాబ్ మారాల్సిందే!

 

తగినంత నిద్ర
మనలో చాలా మందికి మంచం ముందు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం, లేకపోతే టీవీ చూడం అలవాటు. అయితే దీనివల్ల మీ నిద్రించే సమయం తగ్గుతుంది. తద్వారా మీకు తగినంత నిద్ర రాకపోతే, మీ మెదడు మరియు శరీర వ్యవస్థలు ఉత్సాహంగా పనిచేయవు. మీ పనులు సైతం ఆలస్యమవుతాయి. రాత్రి చాలా తక్కువ సమయంగ నిద్రపోవడం చిన్న వయసులో మరణాల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది. నిద్రకు అరగంట ముందు స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి. కనీసం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య నిద్రపోవాలి.

 

చాలా కెఫిన్ తీసుకోవడం
రోజుకు ఒకటి నుండి రెండు కప్పుల కాఫీ మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే కాఫీ అధికంగా తీసుకుంటే అందులో ఉండే కెఫిన్ వల్ల మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇది నిద్రపై సైతం ప్రభావం చూపుతుంది. అధిక కెఫిన్ కారణంగా తలనొప్పి మరియు కడుపు నొప్పి వస్తుంది. నిద్ర లేవడంతోనే కాఫీ, టీ లాంటి వాటికి బదులుగా.. ఒకటి లేక రెండు గ్లాసుల మంచి నీళ్లు త్రాగాలి.

Also Read: Health Benefits Of Neem: వేప తింటే షుగర్ కంట్రోల్, ఎన్నో ప్రయోజనాలు 

ఒత్తిడిని జయించాలి
మీరు ఒత్తిడికి గురవుతున్నారా.. అయితే వచ్చే ఏడాది నుంచైనా దాన్ని జయించండి. మీ భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోలేని పక్షంలో పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక స్థాయిలో ఒత్తిడి అనేది రోగనిరోధక వ్యవస్థ, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, బరువు పెరగడం మరియు మధుమేహం లాంటి వాటికి దారి తీస్తుంది. వ్యాయామం చేయడం పాటలు వినడం, మీకు నచ్చిన హాబీ కోసం కొంత సమయం కేటాయిస్తే ఒత్తిడిని జయించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Sapota Benefits: సపోటా తింటున్నారా.. ఈ విషయాలు మీకు తెలుసా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News