Sapota Benefits: సపోటా తింటున్నారా.. ఈ విషయాలు మీకు తెలుసా!

మనం తరచుగా పండ్లు తింటుంటాం. అయితే వాటి నుంచి మనకు ఏ పోషకాలు లభిస్తున్నాయో అంతగా పట్టించుకోము. కానీ ఏ పండు నుంచి ఏ పోషకాలు, ఖనిజలవణాలు, విటమిన్లు లభిస్తాయో తెలుసుకుని తింటే ఆరోగ్యం మీ సొంతం.
  • Dec 27, 2020, 17:53 PM IST

Health Benefits Of Sapota: మనం తరచుగా పండ్లు తింటుంటాం. అయితే వాటి నుంచి మనకు ఏ పోషకాలు లభిస్తున్నాయో అంతగా పట్టించుకోము. కానీ ఏ పండు నుంచి ఏ పోషకాలు, ఖనిజలవణాలు, విటమిన్లు లభిస్తాయో తెలుసుకుని తింటే ఆరోగ్యం మీ సొంతం.

1 /6

Benefits Of Sapota: సపోటాను చికూ అని కూడా పిలుస్తారు. మామిడి, అరటి, జామ పండ్ల కన్నా సపోటా చాలా తియ్యగా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో పోషక విలువలు కూడా ఉంటాయి. ఇందులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సీ మరియు ఈ, రాగి, ఇనుము మొదలైన ఖనిజ లవణాలు సైతం లభిస్తాయి. Also Read: Health Benefits Of Neem: వేప తింటే షుగర్ కంట్రోల్, ఎన్నో ప్రయోజనాలు

2 /6

సపోటాలో పోషకాలతో పాటు యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలం. దానివల్ల సపోటా తినడం వల్ల గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులకు పోషక విలువలు త్వరగా అందుతాయి. వీరిలో శక్తిని పెంచుతుంది.

3 /6

స్థూలకాయం లేదా ఊబకాయ సమస్యలతో బాధపడేవారు సపోటా తినడం మంచిది. శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. Also Read: ​5 Reasons for Heart Attack: గుండెపోటుకు ప్రధాన కారణాలు ఇవే.. బీ కేర్‌ఫుల్!

4 /6

తరచుగా సపోటా తినడం, లేక సపోటా జ్యూస్‌ తాగడంగానీ చేస్తే జుట్టు సమస్య తగ్గుతుంది. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు పరిష్కారం చూపుతుంది. తల వెంట్రుకలకు పోషకాలు అందుతాయి.

5 /6

సపోటా తింటే విటమిన్-A లభిస్తుంది. విటమిన్- ఏ కంటిచూపును పెంచుతుంది. కంటిచూపు తగ్గకుండా చేస్తుంది.

6 /6

రోగనిరోధక శక్తి పెంచుతుంది. సపోటాలో ఉండే విటమిన్లు, పోషక పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు కొంతమేర పరిష్కారం చూపుతుంది. Also Read: Nasal Sprays for COVID-19: స్ప్రే వాడితే జలుబుతో పాటు కరోనా వైరస్‌‌కు చెక్ పెట్టవచ్చా?