COVID-19 Delta Variant: డెల్టా వేరియంట్ ప్రమాదకరమే, కరోనా టీకాల ప్రభావం అంతంతమాత్రమే

COVID-19 Delta Variant: కరోనా వ్యాక్సిన్లు B.1.617.2 వేరియంట్ లేదా డెల్టా వేరియంట్‌పై 8 రెట్లు తక్కువగా ప్రభావం చూపుతుందని తేలింది. దేశ వ్యాప్తంగా మూడు ఆరోగ్య కేంద్రాలలో విధులు నిర్వర్తిస్తున్న 100కు పైగా ఆరోగ్య సిబ్బంది శాంపిల్స్ సేకరించి అధ్యయనం చేయగా ఈ ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2021, 01:03 PM IST
COVID-19 Delta Variant: డెల్టా వేరియంట్ ప్రమాదకరమే, కరోనా టీకాల ప్రభావం అంతంతమాత్రమే

Delta variant Of COVID-19: డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విషయాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇందుకు తాజాగా నిర్వహించిన సర్వేలో తేలిన విషయాలు ఊతమిస్తున్నాయి. తొలిసారిగా చైనాలోని వూహాన్‌లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ రకంతో పోల్చితే డెల్టా వేరియంట్‌పై కరోనా వ్యాక్సిన్ అంతగా ప్రభావం చూపడం లేదని అధ్యయనంలో గుర్తించారు.

కరోనా వ్యాక్సిన్లు B.1.617.2 వేరియంట్ లేదా డెల్టా వేరియంట్‌పై 8 రెట్లు తక్కువగా ప్రభావం చూపుతుందని తేలింది. దేశ వ్యాప్తంగా మూడు ఆరోగ్య కేంద్రాలలో విధులు నిర్వర్తిస్తున్న 100కు పైగా ఆరోగ్య సిబ్బంది శాంపిల్స్ సేకరించి అధ్యయనం చేయగా ఈ ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి సిబ్బంది నుంచి సైతం శాంపిల్స్ సేకరించి కేంబ్రిడ్జి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థెరపెటిక్ ఇమ్యూనాలజీ అండ్ ఇన్‌ఫెక్షన్ డిసీజ్ వ్యాక్సిన్ ప్రభావంపై అధ్యయనం చేసినట్లు సమాచారం. మొట్టమొదటిసారిగా భారత్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్‌ (Delta Plus Variant of Covid-19)ను ప్రమాదకరమైన వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సందర్భాలలో పేర్కొంది. ఇతర వేరియంట్లపై చూపే ప్రభావం కంటే డెల్టా వేరియంట్‌పై కోవిడ్19 వ్యాక్సిన్లు 8 రెట్లు తక్కువగా ప్రభావం చూపుతున్నాయని వెల్లడించారు.

Also Read: India COVID-19 Cases: ఇండియాలో 111 రోజుల కనిష్టానికి దిగొచ్చిన కరోనా పాజిటివ్ కేసులు, ఫలితాన్నిస్తున్న కోవిడ్19 టీకాలు

యాంటీబాడీలు వీరిలో అంత త్వరగా ఉత్పత్తి కావడం లేదని, మరోవైపు కరోనా వ్యాక్సిన్ సైతం చాలా తక్కువగా ప్రభావం చూపిస్తుందని తేలింది. ఇతరులకు సైతం త్వరగా వ్యాప్తి చెందే స్వభావం ఈ డెల్టా వేరియంట్ లక్షణమని గుర్తించారు. ఇతర కరోనా వేరియంట్ల ద్వారా ఇదివరకే కోవిడ్19 బారిన పడి కోలుకున్న వారిలో తయారైన యాంటీబాడీలు (COVID-19 Vaccine) సైతం డెల్టా రకం కరోనా వేరియంట్‌ను ఎదుర్కొలేకపోతున్నాయి. అందువల్లే కొందరు రెండో పర్యాయం డెల్టా కరోనా వేరియంట్ బారిన పడ్డారని తెలిపారు.

Also Read: Corona third wave: ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది ?

ఈ అధ్యయనం వివరాలు గమనిస్తే మనం సాధించింది కొంత మాత్రమే, కోవిడ్19పై మరిన్ని ప్రయోగాలు, అధ్యయనాలు జరగాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలీజ అండ్ ఇమ్యూనాలజీ ఛైర్‌పర్సన్, డాక్టర్ చంద్ వాట్టల్ అభిప్రాయపడ్డారు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయని నిర్లక్ష్యం చేస్తే మాత్రం దేశం మొత్తం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని, ప్రజలు కోవిడ్19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News