India COVID-19 Cases: ఇండియాలో 111 రోజుల కనిష్టానికి దిగొచ్చిన కరోనా పాజిటివ్ కేసులు, ఫలితాన్నిస్తున్న కోవిడ్19 టీకాలు

India Reports lowest COVID-19 cases in 111 days: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 111 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. వరుసగా రెండో రోజు 40వేల దిగువకు కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్19 నిబంధనలు పాటిస్తే కొత్త వేవ్ ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2021, 10:16 AM IST
  • గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,703 మందికి కరోనా పాజిటివ్
  • దేశవ్యాప్తంగా మరో 553 కోవిడ్19 మరణాలు సంభవించాయి
  • ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు ప్రస్తుతం 4,64,357 ఉన్నాయి
India COVID-19 Cases: ఇండియాలో 111 రోజుల కనిష్టానికి దిగొచ్చిన కరోనా పాజిటివ్ కేసులు, ఫలితాన్నిస్తున్న కోవిడ్19 టీకాలు

India Reports lowest COVID-19 cases in 111 days: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది. ఈ క్రమంలో భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 111 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. వరుసగా రెండో రోజు 40వేల దిగువకు కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్ చేయించుకోవడం, కోవిడ్19 నిబంధనలు పాటిస్తే కొత్త వేవ్ ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. 

ఇండియాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం (జులై 6న) ఉదయం 8 గంటల వరకు కొత్తగా 34,703 మందికి కరోనా సోకింది.  తాజా కేసులతో కలిపితే దేశంలో మొత్తం కరోనా (India CoronaVirus Cases) కేసుల సంఖ్య 3,06,19,932కు (30 కోట్ల 6 లక్షల 19 వేల 932)కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే మరోసారి కరోనా కేసులతో పాటు కరోనా మరణాలు తగ్గాయి. దేశవ్యాప్తంగా మరో 553 కోవిడ్19 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,03,281 (4 లక్షల 3 వేల 281)కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. భారత్‌లో ఇప్పటివరకూ 35 కోట్ల 75 లక్షల 53 వేల 612 డోసుల కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది.

Also Read: Indians Travel Ban: ఇండియా ప్యాసింజర్స్‌పై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేసిన యూరప్ దేశం

దేశ వ్యాప్తంగా చికిత్స అనంతరం మరో 51,864 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. గత ఏడాది నుంచి భారత్‌లో ఇప్పటివరకూ కోలుకున్న కరోనా బాధితుల సంఖ్య 2,97,52,294 (2 కోట్ల 97 లక్షల 52 వేల 294)కు చేరుకుంది. దేశంలో కరోనా రికవరీ రేటు 97.17 శాతానికి పెరిగింది. ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు (Corona Cases) ప్రస్తుతం 4,64,357 (4 లక్షల 64 వేల 357) ఉన్నాయని తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు (Delta Plus Variant) నమోదవుతున్నా, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం, కోవిడ్19 నిబంధనలు పాటిస్తే కరోనా థర్డ్ వేవ్ రావడానికి మరికొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆగస్టులో థర్డ్ వేవ్ వేస్తుందని కొన్ని ఆరోగ్య సంస్థలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

Also Read: EPFO Benifits: ఈపీఎఫ్ ఖాతాలున్నాయా, అయితే ఈ 5 EPF బెనిఫిట్స్ తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News