HMPV Test: హెచ్ఎంపీవీ నిర్ధారణ ఎలా చేస్తారు, ఎంత ఖర్చవుతుందో తెలుసా

HMPV Test: చైనా నుంచి వ్యాపిస్తున్న కొత్త వైరస్ హెచ్ఎంపీవీ ఇప్పుడు దేశాన్ని భయపెడుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు బయటపడుతున్నాయి. అయితే ఈ వైరస్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నా ప్రజల్లో మాత్రం భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో వైరస్ నిర్ధారణ ఎలా చేస్తారో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 9, 2025, 09:56 AM IST
HMPV Test: హెచ్ఎంపీవీ నిర్ధారణ ఎలా చేస్తారు, ఎంత ఖర్చవుతుందో తెలుసా

HMPV Test: చైనా కొత్త వైరస్ హ్యూమన్ మెటానిమోవైరస్ కేసులు ఇండియాలో ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 10 వరకూ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అప్రమత్తత జారీ చేసింది. ఈ వైరస్ సోకితే ఎలాంటి లక్షణాలుంటాయి, ఏ పరీక్షతో నిర్ధారణ జరుగుతుంది, ఎంత ఖర్చవుతుందనే వివరాలు మీ కోసం.

హెచ్ఎంపీవీ అనేది ఓ సాధారణ శ్వాసకోస వైరస్. తేలికపాటి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కన్పిస్తాయి. సాధారణంగా చలికాలంలో కన్పించే లక్షణాలే ఉంటుంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్దుల్ని టార్గెట్ చేస్తుంది. ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది. హెచ్ఎంపీవీ నిర్ధారణకు బయోఫైర్ ప్యానెల్ వంటి లేటెస్ట్ డయాగ్నోస్టిక్ పద్దతులు వాడుతున్నారు. ఈ వ్యాధిని ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా కూడా నిర్ధారిస్తున్నారు. దేశంలోని ప్రముఖ ల్యాబొరేటరీల్లో అయితే 3 వేల నుంచి 8 వేల వరకూ వసూలు చేస్తున్నారు. సమగ్రమైన పరీక్ష చేయించుకుంటే 20 వేల వరకూ అవుతుంది. 

ముందు సాధారణ లక్షణాలే ఉంటాయి. నిర్లక్ష్యం చేస్తే మాత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నిమోనియా వంటి వ్యాధులకు కారణమౌతుంది. చిన్నారుల్లో తీవ్రత అధికంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావచ్చు. సైనోసిస్ లేదా పెదాలు , వేళ్లు నీలి రంగులో మారడం గమనించవచ్చు. దీనికి ప్రత్యేకమైన యాంటీ వైరల్ మందుల్లేవు. కరోనా మహమ్మారిని ఏ విధంగా నయం చేశారో అదే పద్ధితి ఉంటుంది. ఇంట్లో ఉండి పరిస్థితి మెరుగుపర్చుకోవచ్చు. ఆసుపత్రిలో అయితే రోగి పరిస్థితిని బట్టి ఆక్సిజన్ అందించవచ్చు. 

Also read: Fruits Precautions: ఉదయం పరగడుపున ఈ 5 పండ్లు తింటే ఎంత ప్రమాదమో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News