Pumpkin: ఈ ఒక కాయగూర తో ఎన్నో సమస్యలకు చెక్

Pumpkin: మనం రోజు తీసుకునే కూరగాయలలో మనకు కావలసిన ఎన్నో పోషకాలు సులభంగా అందుతాయి. మన శరీరానికి అవసరమైన పోషక విలువలను అందించడంతోపాటు పలు రకాల వ్యాధులను నివారించే గుమ్మడికాయ గురించి మీకు తెలుసా మీకు తెలుసా?

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2023, 06:44 PM IST
Pumpkin: ఈ ఒక కాయగూర తో ఎన్నో సమస్యలకు చెక్

Pumpkin:

గుమ్మడికాయ.. అత్యంత పోషక విలువలు కలిగిన ఈ గుమ్మడి కాయ అందరికి అందుబాటులో ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడే వారికి ఈ గుమ్మడికాయ తీసుకోవడం ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. గుమ్మడికాయ తీసుకోవడం వల్ల రక్తంలోని చక్రస్థాయిలో అదుపులో ఉండడంతో పాటు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. సన్నబడాలి అనుకునేవారు గుమ్మడికాయని వారి డైట్ లో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి ఎంతో మేలుని కలిగిస్తాయి.

అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. తమ బరువు తగ్గించుకోవడానికి పలు రకాల డైట్లు చేసి ఫలితం లేక నిరసించి పోతున్నారు. మీరు మీ డైట్ లో రోజు గుమ్మడికాయని తీసుకోవడం ఒక అలవాటుగా పెట్టుకున్నట్లయితే క్రమంగా బరువు తగ్గడమే కాదు లైఫ్ లాంగ్ మంచి ఫిజిక్ మైంటైన్ చేయగలుగుతారు. అంతెందుకు గుమ్మడికాయని తీసుకుంటే క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధి కూడా మీకు ఎప్పటికీ రాదు.

క్యాన్సర్ వ్యతిరేక ప్రభావం కలిగిన గుమ్మడికాయ శరీరంలో క్యాన్సర్ కణాలను పెరగనివ్వదు. ప్రస్తుతం ఆడవారు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి రొమ్ము క్యాన్సర్ పెరుగుదలను నియంత్రించడంలో గుమ్మడికాయ ఎంతో సహాయపడుతుంది. పైగా గుమ్మడికాయ తినేవారికి కళ్ళు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. గుమ్మడికాయలో అధిక మోతాదులో లభించే విటమిన్ ఎ కళ్లకు ఎంతో మేలు కలగజేస్తుంది.

గుమ్మడికాయ మీ డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు మీ అందం కూడా ఇనుమడుస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయ రెగ్యులర్ గా తీసుకునే వారికి చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అయితే మంచిది కదా అని విపరీతంగా గుమ్మడికాయ తీసుకుంటే మళ్ళీ మీకే గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

అలాగే షుగర్ పేషెంట్స్ దీన్ని తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కర స్థాయిని చాలా తగ్గిస్తుంది కాబట్టి మీకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఫుడ్ అలర్జీస్ లాంటివి ఏమైనా ఉంటే గుమ్మడికాయ సరిపడుతుందా లేదా తెలుసుకొని తర్వాతే తీసుకోవడం మంచిది. గుమ్మడికాయని కేవలం హల్వా లాగా మాత్రమే కాదు పులుసులో సాంబారులో తాలింపులో ఎలాగైనా వాడుకోవచ్చు. సలాడ్స్ తినేవాళ్లు దీన్ని బాగా స్టీమ్ చేసి సలాడ్ చేసుకోవచ్చు. మీ స్మూతీలలో ,జ్యూస్ లలో ఎలా అయినా గుమ్మడికాయను వాడవచ్చు.

ఇది కూడా చదవండి: NED VS SA: వరల్డ్ కప్ లో మరో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నెదర్లాండ్స్..

ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న బన్నీ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook 

Trending News