Big Shock To Metro Commuters: మెట్రో ప్రయాణీకులకు బిగ్‌షాక్.. హాలిడే కార్డుతోపాటు 10 శాతం రాయితీకి మంగళం..

Big Shock To Hyderabad Metro Commuters: మెట్రో హైదరాబాద్ ప్రయాణీకులకు బిగ్‌ షాక్ ఇచ్చింది.  రాయితీలకు మంగళం పాడింది. 59 కార్డును రద్దు చేసింది. 10 శాతం రాయితీని కూడా పూర్తిగా రద్దు చేసింది.

Written by - Renuka Godugu | Last Updated : Apr 7, 2024, 12:47 PM IST
Big Shock To Metro Commuters: మెట్రో ప్రయాణీకులకు బిగ్‌షాక్.. హాలిడే కార్డుతోపాటు 10 శాతం రాయితీకి మంగళం..

Big Shock To Hyderabad Metro Commuters: మెట్రో హైదరాబాద్ ప్రయాణీకులకు బిగ్‌ షాక్ ఇచ్చింది.  రాయితీలకు మంగళం పాడింది. 59 కార్డును రద్దు చేసింది. 10 శాతం రాయితీని కూడా పూర్తిగా రద్దు చేసింది. దీంతో ప్రయాణీకులు ఇలా రద్దు చేయడం ఎంటని ఆశ్చర్యపోతున్నారు. మెట్రో ప్రయాణీకులకు ఎల్‌అంట్‌టీ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. రూ. 59 హాలిడే కార్డును పూర్తిగా ఎత్తేసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రయాణిస్తే 10 శాతం రాయితీని కూడా రద్దు చేసింది.  దాదాపు 5 లక్షల మంది మెట్రో ద్వారా ప్రయాణం చేస్తారు. ఇలా రాయితీని రద్దు చేయడం పట్ల ప్రయాణీకులు మండిపడుతున్నారు.

ఎండకాలం ప్రయాణీకుల రద్దీ కూడా పెరిగిన నేపథ్యంలో హైదరబాద్ మెట్రో ఈ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పటికే కోచ్‌ల సంఖ్య పెంచమని ప్రయాణీకులు డిమాండ్‌ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక హాయిగా ఎండకాలం మెట్రో ప్రయాణం చేయవచ్చనుకున్న మెట్రో ప్రయాణీకులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిరోజూ లక్షల సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. అయినా ఇలా రాయితీలను రద్దు చేయడం ఎంటని ప్రశ్నిస్తున్నారు. 

ఇదీ చదవండి: తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్కకు అవమానం.. ఓవరాక్షన్ చేసిన సీపీ తరుణ్ జోషి..

ఇవాల్టీ నుంచే అమలు కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎక్కువ శాతం మంది రూ.59 ప్రయాణించే వారి సంఖ్య కూడా ఎక్కువ ఉంది. రాయదుర్గం టూ నాగోల్ గుండా వెళ్లే ప్రయాణీకుల సంఖ్య కూడా పెరిగింది. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణించే మెట్రో కార్డుపై కూడా రాయితీని రద్దు చేశారు.

ఇదీ చదవండి:  పదేళ్లు అడవి పందుల్లా దోచుకున్నారు.. కేసీఆర్ కు సీఎం రేవంత్ ధమ్కీ.. వైరల్ గా మారిన వీడియో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News