Glass Symbol: ఏపీలో జనసేన-తెలుగుదేశం-బీజేపీ కూటమికి కష్టాలు వచ్చి పడ్డాయి. ఎన్నికల సంఘం చేసిన ప్రకటన కూటమిలోని జనసేనకు షాక్ ఇచ్చింది. జనసేన గుర్తు గాజు గ్లాసు సమస్యగా మారనుంది. ఈ పరిణామం జనసేనకు కాకుండా కూటమిలోని తెలుగుదేశం, బీజేపీలకు ఇబ్బందిగా మారనుంది. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది
కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఫ్రీ సింబల్స్ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు ఉంది. జనసేన గుర్తు గాజు గ్లాసు ప్రజల్లో బాగానే చొచ్చుకెళ్లింది. కానీ ఎన్నికల సంఘం జనసేనకు గుర్తింపు కలిగిన పార్టీ హోదా ఇవ్వకపోవడంతో గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో వెళ్లిపోయింది. కేవలం జనసేన అభ్యర్ధులు బరిలో ఉన్నచోటే ఆ పార్టీకు గాజు గ్లాసు కేటాయిస్తారు. మిగిలిన చోట ఇండిపెండెంట్ ఎవరైనా గాజు గ్లాసు కోరుకుంటే ఆ అభ్యర్ధికి కేటాయించే అవకాశాలున్నాయి. ఇది కచ్చితంగా జనసేనకు ఎలాంటి ఇబ్బంది కల్గించకపోయినా కూటమిలోని బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు సమస్యగా మారవచ్చు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన నేరుగా పోటీ చేసేది 21 స్థానాల్లో. అంటే మిగిలిన 154 స్థానాల్లో పోటీ చేసే బీజేపీ, తెలుగుదేశం అభ్యర్ధులకు సమస్యగా మారనుంది.
జనసేన గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్స్ జాబితాలో ఎన్నికల సంఘం ప్రకటించడంతో బీజేపీ-తెలుగుదేశం అభ్యర్ధులు సందిగ్దంలో పడ్డారు. తమ స్థానాల్లో పోటీ చేసే ఇండిపెండెంట్ అభ్యర్ధులు గాజు గ్లాసు కోరుకుంటే తమ పరిస్థితి ఏంటనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదంటోంది. పైకి ఇబ్బంది లేదని చెబుతున్నా లోలోపల మాత్రం ఆందోళన చెందుతోంది. అందుకే న్యాయ నిపుణులతో చర్చిస్తోంది.
Also read: Gratuity Rules: గ్రాట్యుటీ అంటే ఏమిటి, ఎంత కట్ అవుతుంది, ఎప్పుడు చేతికి అందుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook