Lok Sabha Elections Jan Lok Pal Survey 2024: తెలంగాణ లోక్‌సభలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? ఆసక్తిరేకిస్తోన్న లేటెస్ట్ సర్వే..

Telangana Lok Sabha Elections jan lok poll Survey 2024: తెలంగాణలో ఉన్న లోక్‌సభ సీట్లలో   భారతీయ జనతా పార్టీ   గెలిచే సీట్లు ఇవేనా..? తాజాగా జన్‌లోక్‌పాల్ సర్వే చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 16, 2024, 07:30 AM IST
Lok Sabha Elections Jan Lok Pal Survey 2024: తెలంగాణ లోక్‌సభలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? ఆసక్తిరేకిస్తోన్న లేటెస్ట్ సర్వే..

Telangana Lok Sabha Elections jan lok poll Survey 2024: మన దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. దేశ వ్యాప్తంగా ఈ నెల 19న తొలి విడతా ఎన్నికలతో సార్వత్రిక ఎన్నికల శంఖారావం మొదలు కాబోతుంది. మొత్తం ఏడు విడతల్లో దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1 జరిగే చివరి విడతతో ఈ ఎన్నికల క్రతువు ముగియనుంది. జూన్ 4న దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. 2024లో జరిగే ఎలక్షన్స్‌లో  తెలంగాణలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో అధికారంలో  ఉన్న కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్టు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఇపుడు జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో చాలా చోట్ల మూడు స్థానానికి పడిపోయింది.  తాజాగా ప్రముఖ సర్వే సంస్థ జన్‌లోక్ పాల్ తెలంగాణలో భారతీయ జనతా  పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లపై సంచలన సర్వేను బయట పెట్టింది. ఈ సర్వేను మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో 2 శాతం శాంపుల్ సైజులో  ఈ సర్వేను నిర్వహించినట్టు ఈ సంస్థ ప్రకటించింది.

 ప్రస్తుత బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ స్థానం జహీరాబాద్ విషయానికొస్తే.. %

ఇక్కడ బీజేపీ (BJP) - 39.28 %
కాంగ్రెస్ పార్టీ (INC) - 37.05 %
బీఆర్ఎస్ (BRS) -   19.60 %
ఇతరులు  - 4.07 %
ఈ సర్వే ప్రకారం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన జహీరాబాద్ స్థానాన్ని బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది.
 
ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ స్థానమైన సికింద్రాదాద్  స్థానం విషయానికొస్తే..
ఇక్కడ నుంచి మరోసారి కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి రెండోసారి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరుపున సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీకి దిగుతున్నారు.
సర్వే ప్రకారం ఇక్కడ బీజేపీ (BJP) - 36.77 %
బీఆర్ఎస్ పార్టీ (BRS) - 31.05 %
కాంగ్రెస్ పార్టీ (INC) - 27.69 %
ఇతరులు - 4.49 %

ఈ సర్వే ప్రకారం ఈ స్థానాన్ని బీజేపీ పార్టీ నిలబెట్టుకునే అవకాశాలున్నాయని సర్వే చెబుతోంది.

మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం విషయానికొస్తే..

ఇక్కడ బీజేపీ (BJP) - 38.90 %
కాంగ్రెస్ (INC) - 34.25 %
బీఆర్ఎస్ (BRS) - 23.53 %
ఇతరులు - 3.32 %

మొత్తంగా ఈ సర్వేలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి మధ్య దాదాపు 4 శాతానికి పైగా తేడా ఉంది. ఈ సర్వే ప్రకారం ఈ సీటును బీజేపీ గెలవడం దాదాపు ఖాయమనే ఈ సర్వే చెబుతోంది.

మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం విషయానికొస్తే..
ఇక్కడ బీజేపీ తరుపున ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ పోటీ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ తరుపున మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరుపున వంశీచంద్ రెడ్డి బరిలో ఉన్నారు. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో కూడా ఈ ముగ్గురే ఆయా  పార్టీల తరుపున పోటీకి దిగారు. మరోసారి ప్రత్యర్ధులుగా బరిలో దిగుతున్నారు.
ఇక్కడ బీజేపీ (BJP) - 37.99 %
కాంగ్రెస్ (INC) - 36.40 %
బీఆర్ఎస్ (BRS) - 21.27 %
ఇతరులు - 4.34 %

ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక శాతం ఓటు తేడా ఉంది. మొత్తంగా చూసుకుంటే బీజేపీకి మహబూబ్ నగర్ ఎడ్జ్ ఉంది.

ఆదిలాబాద్ ఎంపీ సీటు విషయానికొస్తే..

ఇక్కడ బీజేపీ (BJP) - 48.50%
కాంగ్రెస్ పార్టీ (INC) -36.05%
బీఆర్ఎస్ (BRS) - 12.19%
ఇతరులు - 3.26%
మొత్తంగా ఆదిలాబాద్ లోక్‌ సభ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య దాదాపు 12 శాతం ఓటు తేడా ఉంది. ఈ సీటు బీజేపీ ఖచ్చితంగా గెలిచే సీట్లలో ఆదిలాబాద్ ఒకటి అని చెప్పాలి.

భువనగిరి లోక్ సభ విషయానికొస్తే..

భువనగిరి ఎంపీ స్థానం విషయానికొస్తే..
BJP - 34.90 %
కాంగ్రెస్ - 33.05 %
BRS - 26.12 %
ఇతరులు - 5.93 %  ఉంది.
ఇక్కడ బీజేపీ తరుపున బూర నర్సయ్య గౌడ్ పోటీలో ఉన్నారు. అటు కాంగ్రెస్ తరుపున చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. మొత్తంగా ఈ సీటు బీజేపీ, కాంగ్రెస్  పార్టీ మధ్య పోటా పోటీగా ఉంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కరీంనగర్ లోక్‌సభ సీటు విషయానికొస్తే..
ఇక్కడ బీజేపీ తరుపున ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఎంపీగా బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్ధిని ప్రకటించలేదు. మరోవైపు బీఆర్ఎస్ తరుపున బోయనపల్లి వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు.
ఇక్కడ బీజేపీ (BJP) - 41.90 %
కాంగ్రెస్ (INC) - 28.25 %
బీఆర్ఎస్ (BRS) - 26.62 %
ఇతరులు - 3.23 %

ఈ సర్వే ప్రకారం కరీంనగర్ ఎంపీ సీటును బీజేపీ ఖాతాలోకి ఖచ్చితంగా వెళుతుంని ఈ సర్వే ఘోషిస్తోంది.

మెదక్ పార్లమెంట్ సీటు విషయానికొస్తే.. బీఆర్ఎస్ కంచుకోట అయిన ఈ స్థానంలో బీజేపీ బాగా పుంజుకున్నట్టు ఈ సర్వే చెబుతోంది.
బీజేపీ (BJP) - 33.75 %
కాంగ్రెస్ (INC) - 31.20 %
బీఆర్ఎస్ (BRS) - 26.15 %
ఇతరులు - 8.90 %

ఈ సర్వే ప్రకారం ఈ స్థానాన్ని బీజేపీ గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

చేవెళ్ల లోక్ సభ స్థానం విషయానికొస్తే..
ఇక్కడ బీజేపీ (BJP) - 38.05 %
కాంగ్రెస్ (INC) -20.03 %
ఇతరులు - 2%
ఈ సర్వే ప్రకారం ఈ సీటు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం విషయానికొస్తే..
ఈ సీటులో బీజేపీ తరుపున ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ పార్టీ తరుపున జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరుపున బాజిరెడ్డి గోవర్దన్ పోటీ చేస్తున్నారు.

ఇక ధర్మపురి అరవింద్ పసుపు బోర్డ్ సాధించడంతో ఆయనపై నియోజకవర్గ ప్రజలు పాజిటివ్‌గా ఉన్నట్టు  ఈ సర్వే ఘోషిస్తోంది.
ఇక్కడ బీజేపీ (BJP) - 46.90 %
కాంగ్రెస్ (INC) - 32.25 %
బీఆర్ఎస్ (BRS) - 15.29 %
ఇతరులు - 5.56 % ఉంది.

జన్‌ లోక్ పాల్ సర్వే ప్రకారం తెలంగాణలో జహీరాబాద్, మెదక్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, భువనగిరి స్థానాలు గెలుస్తుందని చెబుతోంది. మరి ఈ సర్వే చెబుతున్నట్టు  బీజేపీ తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News