Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..

Sri Rama Navami 2024: శ్రీరాముడు ప్రపంచానికి గొప్ప ఆదర్శ ప్రాయుడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. రామయ్య చూపించిన మార్గంలో అందరు నడవాలని పెద్దలు చెబుతుంటారు. శ్రీ రామాయణంలోని ప్రతి ఒక్క పాత్ర మన జీవితంలో అనుకోకుండా కష్టాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలో తెలియజేస్తున్నాయి.  

Last Updated : Apr 15, 2024, 10:08 AM IST
  • హక్కుల కంటే బాధ్యతలు గొప్పదన్నది సూచిస్తున్నది- రామతత్వం..
  • భక్తులందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..

Sri Rama Navami 2024 Special Quotes Slokas and Wishes In Telugu:

1. శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే..అందరికి శ్రీరామ నవమి  శుభాకాంక్షలు..

2. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘనాథాయ నాథయా సీతాయాం పతయే నమః ఆ ఆదర్శ పురుషుడు రామయ్య ఆశీర్వాదాలు మీకుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు..

౩. ఆపదామపహర్తరాం ధాతారం సర్వసంపదాం లోకాభి రామం శ్రీరామం భుయో భుయో నమామ్యహాం.. జై శ్రీరామ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరాముడి జన్మదితోత్సవ శుభాకాంక్షలు

4. పుణ్య దంపతులైన శ్రీరాముడి, సీతమ్మ తల్లి ఆశీర్వాదం వల్ల మీరు ఎల్ల వేళలా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్..

5. శ్రీ రామనవమి పండుగ మీ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు,సిరిసందపలు కల్గజేయాలని కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

6. శుధ్ద బ్రహ్మా పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మధ్యామర ప్రార్థిత రామ.. మీకు శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు

7.హక్కుల కంటే బాధ్యతలు గొప్పదన్నది సూచిస్తున్నది - రామతత్వం,
  కష్టంలో భర్తతో కలిసి నడవాలాన్నది - సీతతత్వం
  కుటుంబ బాధ్యతలు పంచుకోమంటుంది - లక్ష్మణ తత్వం
  నమ్మన వారి కోసం ఎంతకైన తెగించమంటుంది - ఆంజనేయ తత్వం
  ఇలా శ్రీ రామయణంలోని గొప్పవారి చూపించిన ఆదర్శమార్గంలో నడవాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు

8. మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికి శ్రీరామ నవవి పండుగ శుభాకాంక్షలు..

9. ఆ జగదభి రాముడు, కౌసల్య రాముడు, జానకీ రాముడు, దశరథ రాముడి శుభాశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీరామ నవవి ఉత్సవ శుభాకాంక్షలు.
 
10. రాముడు అంటే ఒక మాటమీద నిలబడ్డాడు. ఏకపత్ని వ్రతుడు. పరస్త్రీలను కన్నేత్తి కూడా చూడలేదు. తన వారి కోసం ఎన్నో కష్టాలను భరించాడు. తన వంశానికి, తండ్రికి చెడ్డపేరు రాకుండా కాపాడుకున్నాడు. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున ప్రతిఇంట్లో రాముడిని భక్తితో పూజించుకొవాలి.అదేవిధంగా ఎక్కడైన కళ్యాణం జరుగుతుంటే అక్కడికి వెళ్లి పాల్గొనాలి. ఇలా చేస్తే మన జీవితంలో ఏవైన కష్టాలు ఉంటే అవి దూరమైపోతాయి. 

 

Trending News