Covid-19 vaccine second dose due: ఆ 10 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకోలేదు

Covid-19 vaccine second dose due pending: ప్రస్తుతానికి దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ... ఇంతటితోనే కరోనా పూర్తిగా మాయమైందని అనుకోలేమని, కరోనావైరస్ థర్డ్ వేవ్ (COVID-19 third wave) రూపంలో కరోనా ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఎలాగూ ఉండనే ఉన్నాయని డా పాల్ (Dr VK Paul) అభిప్రాయపడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2021, 11:28 PM IST
  • ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకోని 10 కోట్ల మంది
  • సింగిల్ డోస్ తీసుకున్న వారిలో ప్రయోజనం సగం వరకే
  • రెండు డోసులు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్న డా. వికె పాల్
Covid-19 vaccine second dose due: ఆ 10 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకోలేదు

Covid-19 vaccine second dose due pending: కరోనావైరస్ నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో కరోనా సెకండ్ డోస్ తీసుకునే వారి సంఖ్య తగ్గుతుండటంపై నేషనల్ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే రెండో డోస్ తీసుకోవాల్సిన జనం 10 కోట్ల మంది వరకు ఉన్నట్టు డా. వి.కె. పాల్ తెలిపారు. ఇకనైనా కొవిడ్-19 వ్యాక్సిన్‌కి ప్రాధాన్యత ఇచ్చి రెండో డోస్ తీసుకోవాల్సిన వారు తీసుకోవాల్సిందిగా పాల్ విజ్ఞప్తి చేశారు. సింగిల్ డోస్‌తో శరీరంలో పూర్తి యాంటీబాడీస్ పెరగవు, వ్యాధి నిరోధక శక్తి (Immunity power) రాదన్న ఆయన.. రెండో డోస్ తీసుకుంటేనే వ్యాక్సిన్‌తో వచ్చే పూర్తి ఫలితం, ప్రయోజనం అందుతుందని సూచించారు. 

సింగిల్ డోస్ తీసుకున్న వారిలో కరోనాను ఎదుర్కునే శక్తి సగం వరకే ఉంటుందని, రెండో డోస్ (second dose) తీసుకున్న వారికే అది పూర్తిగా సంక్రమిస్తుందని వి.కె. పాల్ గుర్తుచేశారు. ప్రస్తుతానికి దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ... ఇంతటితోనే కరోనా పూర్తిగా మాయమైందని అనుకోలేమని, కరోనావైరస్ థర్డ్ వేవ్ (COVID-19 third wave) రూపంలో కరోనా ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఎలాగూ ఉండనే ఉన్నాయని డా పాల్ (Dr VK Paul) అభిప్రాయపడ్డారు.

Also read : TDP Leader Pattabhi Arrested : టీడీపీ నేత పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులు

ప్రస్తుతం దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుట్నిక్ వి వ్యాక్సిన్లు (Covishield, Covaxin and Sputnik V vaccine) అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా రెండు డోసులు తీసుకోవాల్సిన వ్యాక్సున్లే. కొవాగ్జిన్, కొవీషీల్డ్ రెండూ కూడా స్వదేశీ వ్యాక్సిన్లు కాగా.. స్పుట్నిక్ వ్యాక్సిన్ మాత్రం రష్యాలో డెవలప్ చేసిన వ్యాక్సిన్ (COVID-19 vaccination). రష్యా తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ (Single dose vaccine) స్పుట్నిక్ లైట్ ప్రస్తుతం భారత్‌లో అత్యవసర వినియోగానికి అవసరమైన అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని ఉంది.

Also read : Punjab Politics: త్వరలో కెప్టెన్ అమరిందర్ సొంత పార్టీ , బీజేపీతో పొత్తుకు సంసిద్ధత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News