Vaccination Drive: కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై కీలక సూచనలు చేసిన కేంద్ర ప్రభుత్వం

Vaccination Drive: కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రస్తుత తరుణంగా ప్రత్యామ్నాయంగా ఉంది. మొన్నటి వరకూ ఉన్న వ్యాక్సిన్ కొరత నుంచి దేశం ఇప్పుడు బయటపడుతోంది. అందుకే వ్యాక్సిన్ రెండవ డోసుపై మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని కేంద్రం సూచిస్తోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 20, 2021, 10:07 AM IST
  • దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పురోగతిపై సమీక్ష నిర్వహించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
  • వ్యాక్సినేషన్ డ్రైవ్ పై రాష్ట్ర, కేంద్ర పాలితప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు
  • కోవిడ్ రెండవ డోసుపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి
Vaccination Drive: కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై కీలక సూచనలు చేసిన కేంద్ర ప్రభుత్వం

Vaccination Drive: కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రస్తుత తరుణంగా ప్రత్యామ్నాయంగా ఉంది. మొన్నటి వరకూ ఉన్న వ్యాక్సిన్ కొరత నుంచి దేశం ఇప్పుడు బయటపడుతోంది. అందుకే వ్యాక్సిన్ రెండవ డోసుపై మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని కేంద్రం సూచిస్తోంది. 

ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్(Covid Vaccination)ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ దాదాపు వందకోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగింది. కరోనా మహమ్మారి(Corona pandemic) నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే ప్రత్యామ్నాయంగా ఉంది. అదే సమయంలో దేశంలో ఇప్పుడు వ్యాక్సిన్ లభ్యత అనుకూలంగా ఉంది. మొన్నటి వరకూ ఉన్న వ్యాక్సిన్ కొరత నుంచి దేశం బయటపడుతోంది. రాష్ట్రాల వద్ద కూడా వ్యాక్సిన్ నిల్వలు సరిపడేంతగా ఉన్నాయి. ఈ తరుణంలో వ్యాక్సినేషన్‌పై ముఖ్యంగా రెండవ డోసు వ్యాక్సిన్‌పై ఎక్కువ దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం(Central government)రాష్ట్రాలకు సూచించింది. వ్యాక్సిన్ లభ్యత బాగున్నందున..మొదటి డోసు వేయించుకున్నవారంతా రెండవ డోసు వేసుకునేలా కృషి చేయాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. దేశంలో జనవరి 16 నుంచి కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పటి వరకూ వందకోట్లకు చేరువలో ఉంది. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్,స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. దేశంలో కోవిడ్ రెండవ డోసు తీసుకోనివారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వ్యాక్సిన్ లభ్యత కూడా ఉన్నందున రెండవ డోసు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను(Corona Vaccination Drive)వేగవంతం చేసి లక్ష్యాన్ని సాధించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో ఏడాదికాలంగా అమల్లో ఉన్న నిబంధనలపై తాజాగా రాష్ట్రాల్నించి సూచనలు కోరారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ నెమ్మదిగా జరుగుతున్న జిల్లాల్ని గుర్తించి..అక్కడి సమస్యల్ని పరిష్కరించాలన్నారు. 

Also read: AP Government: రాష్ట్రంలో మారుతున్న 8వ తరగతి సిలబస్, సీబీఎస్ఈకు అనుగుణంగా మార్పు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News