11 మంది దుర్మరణం.. నలుగురి పరిస్థితి విషమం..

గత రెండు నెలలుగా కరోనా మహమ్మారి ప్రబలిన నాటి నుండి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులు తమ స్వస్థలాలకు పయనమయ్యారు.

Last Updated : Jun 1, 2020, 04:20 PM IST
11 మంది దుర్మరణం.. నలుగురి పరిస్థితి విషమం..

న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా కరోనా (Covid-19) మహమ్మారి ప్రబలిన నాటి నుండి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ (Lockdown) కారణంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులు తమ స్వస్థలాలకు పయనమయ్యారు. అయితే క్రమానుగతంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లు నడిపిస్తోంది. దీంతో పాటు వివిధ సదుపాయాలు కల్పిస్తూ వలసకార్మికుల గమ్యస్థానాలను చేరేవేసే కార్యక్రమం చేపట్టింది. 

Also Read: పెద్ద మనసు చాటుకున్న నిహారిక.. వలస కూలీలకు భారీ సాయం

మరోవైపు ప్రస్తుతం లాక్ డౌన్ (Lockdown 5.0) కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌ నుండి నేపాల్‌ వెళ్తున్న వలస కూలీలు స్వస్థలానికి చేరుకోకముందే మరణించారు. భారత్ లోని వివిధ ప్రాంతాల నుండి 30 మందికిపైగా వలస కార్మికులు ప్రత్యేక బస్సులో నేపాల్‌ వెళ్తున్న సమయంలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత నేపాల్‌లోని బాంకే జిల్లాలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కుని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌తోపాటు 11 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారని జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News