Lockdown 5.0: కీలక మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ సర్కార్..

దేశవ్యాప్తంగా నేటితో లాక్ డౌన్ నాల్గో దశ ముగియనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. 

Last Updated : May 31, 2020, 08:26 PM IST
Lockdown 5.0: కీలక మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ సర్కార్..

హైదరాబాద్: దేశవ్యాప్తంగా నేటితో లాక్ డౌన్ Lockdown 4.0 నాల్గో దశ ముగియనున్న నేపథ్యంలో (Telangana) తెలంగాణ ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. కాగా జూన్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ కంటైన్మెంట్ జోన్లకే‌ Lockdown 5.0 వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ప్యూ ఉంటుందని, అంతరాష్ట్ర (Inter state Transportaion) రాకపోకలపై నిషేదం ఎత్తివేసింది. రాష్ట్రంలోని అన్నీ రకాల షాపులు సాయంత్రం 5 గంటలవరకు అనుమతిచ్చిన నేపథ్యంలో లాక్‌డౌన్ 5.0 ప్రకారం రాత్రి 8 గంటల వరకు అనుమతిచ్చింది.

Also Read: Minister Jagadish Reddy: నీ లెక్కెంతంటే.. నీలెక్కెంత అంటూ వాగ్వీవాదానికి దిగిన నేతలు

మరోవైపు రాష్ట్రంలో (Covid-19) కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో 9 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ సోకింది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కి కరోనా సోకిందని, ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 40 మంది పోలీసులకు కరోనా బారిన పడ్డారని అధికారులు తెలిపారు. లాక్ డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా కేసుల తీవ్రత ఎక్కువ కావడంతో పోలీసుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News