భారత్‌కు ఆర్మీ జనరల్ రావత్ సూచనలివే..!

ఆర్మీ డే సందర్భంగా భారత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్, ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా బోర్డర్ సెక్యూరిటీ విషయమై కూడా తన ఆలోచనలను పంచుకున్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యమైన విషయాలు

Last Updated : Jan 13, 2018, 02:20 PM IST
భారత్‌కు ఆర్మీ జనరల్ రావత్ సూచనలివే..!

ఆర్మీ డే సందర్భంగా భారత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్, ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా బోర్డర్ సెక్యూరిటీ విషయమై కూడా తన ఆలోచనలను పంచుకున్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యమైన విషయాలు

*భారత ప్రభుత్వం సరిహద్దు రక్షణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. కేవలం పాకిస్తాన్ బోర్డర్ మీదే కాకుండా, చైనా బోర్డర్ పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా సరిహద్దు దేశాలతో స్నేహంగా ఉంటూ, మన దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించాలని భావిస్తున్న చైనా కుటిలనీతికి భారత్ ఎప్పటికప్పుడు సరైన సమాధానం చెప్పాలి.

*వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఎప్పటికప్పుడు భారత్ కళ్లు కప్పి లోపలికి రావడానికి ప్రయత్నిస్తోంది. మనపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాలి

*అదేవిధంగా భారత్ తన సరిహద్దు దేశాలైన మయన్మార్, భూటాన్, నేపాల్, శ్రీలంక, అఫ్గానిస్తాన్‌లతో బంధాలను పటిష్టం చేసుకోవాలి. ఆ బంధాలను పటిష్టం చేసుకోవడం ద్వారానే చైనాతో మనం వ్యవహరించాల్సిన వ్యూహాలకు బలం ఏర్పడుతుంది

*ముఖ్యంగా ఉత్తర డోక్లామ్‌లో చైనా చాలా పకడ్బందీ పథకాలను రచిస్తోంది. వారిని తిప్పికొట్టే శక్తి భారత ఆర్మీకి ఉందనే నమ్ముతున్నాం

*అలాగే కాశ్మీరులో యువతను ఉగ్రవాదం పట్ల ఆకర్షితులను చేసేందుకు సోషల్ మీడియాని, అంతర్జాలాన్ని ప్రధాన వనురులుగా ఉపయోగిస్తున్నారు. వాటిని నియంత్రించే సైబర్ సెక్యూరిటీ వ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట వేయాలి

Trending News