అటల్ బిహారి వాజ్‌పేయి అంతిమయాత్ర: నిఘా నీడలో స్మృతి స్థల్ పరిసరాలు

స్మృతి స్థల్‌తోపాటు అక్కడకు దారితీసే రహదారులన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకున్న నేషనల్ సెక్యురిటీ గార్డ్స్

Last Updated : Aug 17, 2018, 09:46 PM IST
అటల్ బిహారి వాజ్‌పేయి అంతిమయాత్ర: నిఘా నీడలో స్మృతి స్థల్ పరిసరాలు

మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారి వాజ్‌పేయి అంతిమయాత్ర ఇంకాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు చేయాల్సి ఉన్న స్మృతి స్థల్‌తోపాటు అక్కడకు దారితీసే రహదారులన్నింటిని నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ) విభాగం తమ ఆధీనంలోకి తీసుకుంది. బీజేపీ ఆఫీస్ నుంచి స్మృతి స్థల్ వరకు దారితీయనున్న రహదారిలో ఇప్పటికే భద్రత కట్టుదిట్టం చేశారు. ఇదేకాకుండా స్మృతి స్థల్ వైపు వెళ్లే దారులన్నింటిపై నిఘా ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులతోపాటు విదేశాల నుంచి సైతం వివిధ రాజ్యాధినేతలు అటల్ బిహారి వాజ్‌పేయికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్రం గట్టి చర్యలు తీసుకుంది.

Click here: Atal Bihari Vajpayee's final journey live updates : అటల్ బిహారి వాజ్‌పేయి అంతిమయాత్ర లైవ్ అప్‌డేట్స్  ►

Trending News