Parliament Sessions: పార్లమెంట్​ సమావేశాలకు హాజరవ్వాలని తమ ఎంపీలకు బీజేపీ విప్​!

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. అందరూ తప్పకుండా సమావేశాలకు హాజరవ్వాలని అందులో పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 02:20 PM IST
  • ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు
  • అందరూ హాజరు కావాలని తమ ఎంపీలకు బీజేపీ విప్​ జారీ
  • ఉభయ సభల ముందుకు రానున్న 26 కీలక బిల్లులు!
Parliament Sessions: పార్లమెంట్​ సమావేశాలకు హాజరవ్వాలని తమ ఎంపీలకు బీజేపీ విప్​!

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి (సోమవారం) ప్రారంభమవున్నాయి. 20 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.

బీజేపీ ఎంపీలకు విప్..

ఈ సారి పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం 26 ముఖ్యమైన బిల్లులను (Ne Bills before Parliament winter session) ప్రవేశపెట్టనుందని సమాచారం. ఇందులో నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును తొలుత ప్రవేశపెట్టే (New Farm laws repeal bill) అవకాశముంది.

మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ ఈ బిల్లును పార్లమెంట్​లో ప్రవేశ పెట్టనున్నారు. అయితే ఈ బిల్లు సహా ఇతర బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు లోక్​ సభ ఎంపీలంతా పార్లమెంట్​ సెషన్లకు హాజరవ్వాలని మూడు లైన్ల విప్​ను జారీ చేసింది బీజేపీ. రాజ్య సభ ఎంపీలకు ఇది వరకే విప్ జారీ చేయడం (BJP whip to MPs) గమనార్హం. 

ఈ సారి బిల్లుల్లో క్రిప్టో కరెన్సీ, బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా తగ్గించుకునేందుకు వీలు కల్పించే బిల్లు కూడా ఉన్నట్లు సమాచారం.

వ్యవసాయ చట్టాల ఉపసంహరణ ఎందుకు?

కేంద్రం గత ఏడాది ఈ కొత్త సాగు చట్టాలను తెచ్చిది. అయితే ఈ బిల్లులు కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఉన్నాయంటూ దేశవ్తంగా రైతులు ఆందోళన చేపట్టారు. పంజాబ్, హరియాణా రైతులు ఢిల్లీ సరిహద్దులుల్ గుడారాలు ఏర్పాటు చేసుకుని దాదాపు ఏడాది కాలం పాటు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకుంది. స్వయంగా ప్రధాని మోదీ (PM Modi on New Farm laws) దీనిపై ప్రకటన చేశారు. నిజానికి బిల్లులు మేలు చేసేవే అని.. అయితే అన్ని వర్గాల రైతులకు ఈ విషయం వివరించలేకపోయామని పేర్కొన్నారు.

కొవిడ్ నిబంధనల మధ్యే సమావేశాలు..

కరోనా కారణంగా గత ఏడాదిన్నర కాలంగా ఏ సమావేశాలైనా.. కొవిడ్ నిబంధనల మధ్యే జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు సైతం కఠిన కొవిడ్ నిబంధనల మధ్యే సాగాయి.

అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్నా.. కఠిన కొవిడ్ నిబంధనల మధ్యే సమావేశాలు జరగనున్నాయి. ఈ నిబంధనల ప్రకారం.. ఉభయ సభలకు హాజరయ్యే ఎంపీలు, ఇతర సిబ్బంది అందరూ కొవిడ్ టెస్ట్​ చేయించుకోవడం తప్పనిసరి.

Also read: Rape and Murder: ఖాళీ భవనంలో కుళ్లిపోయిన స్థితిలో యువతి మృతదేహం

Also read: Corona cases in India: తగ్గిన కరోనా కేసులు- 24 గంటల్లో 8,318 మందికి పాజిటివ్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News