West Bengal: వారిద్దరి మధ్య ముదురుతున్న వివాదం....గవర్నర్​ను ట్విట్టర్​లో బ్లాక్ చేసిన సీఎం..!!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్​ ధన్​కర్​ను​ ట్విట్టర్​లో బ్లాక్ చేశారు. ఆయన తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచూ చేసే ట్వీట్ల వల్ల మనస్తాపం చెందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 08:14 PM IST
  • సీఎం, గవర్నర్ మధ్య వివాదం
  • గవర్నర్​ను ట్విట్టర్​లో బ్లాక్ చేసిన సీఎం
West Bengal: వారిద్దరి మధ్య ముదురుతున్న వివాదం....గవర్నర్​ను ట్విట్టర్​లో బ్లాక్ చేసిన సీఎం..!!

Mamata Banerjee Blocks Governor On Twitter: పశ్చిమ బెంగాల్ లో సీఎంకు,గవర్నర్ కు మధ్య వివాదం రోజురోజుకూ మదురుతోంది. తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)...ఆ రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను (Jagdeep Dhankhar) సోమవారం తన ట్విట్టర్ (Twitter) ఖాతాలో బ్లాక్ చేశారు, 

''దానికి నేను ముందుగా క్షమాపణలు చెబుతున్నాను. అతను (జగ్‌దీప్ ధంఖర్) ప్రతిరోజూ నన్ను లేదా నా అధికారులను దుర్భాషలాడుతూ ఏదో ఒక ట్వీట్ చేస్తాడు. రాజ్యాంగ విరుద్ధమైన, అనైతికమైన విషయాలు మాట్లాడతాడు. అతను సలహా ఇవ్వడు. ఏ సూచనలు చేయడు. ఎన్నికైన ప్రభుత్వాన్ని బంధిత కార్మికుల్లా చూస్తాడు. అందుకే అతనిని నా ట్విట్టర్ ఖాతా నుండి తొలగిస్తున్నాను'' అంటూ మమతా బెనర్జీ ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 

చాలా సందర్భాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, పోలీసు చీఫ్‌ను గవర్నర్ బెదిరించారని బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. ధన్‌ఖర్‌ను తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి (PM Modi) పలుమార్లు లేఖలు రాసినా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు.

Also Read: February New Rules: ఫిబ్రవరి 1 , రేపటి నుంచి మారనున్న కొత్త రూల్స్, నిబంధనలు ఇవే

మమతా బ్లాక్  చేయడంపై గవర్నర్ స్పందించారు. ''భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం, విధేయత ఉన్నవారు...రాష్ట్రంలో ఎటువంటి రాజ్యాంగ నిబంధనలు, చట్ట నియమాలను “బ్లాక్” చేయలేరని..రాజ్యాంగంలోని ఆర్టికల్ 159 ప్రకారం ఇది తప్పనిసరి'' అని గవర్నర్ ట్వీట్ చేశారు. 

 బెంగాల్ గవర్నర్ గా 2019లో నియమితులయ్యారు ధన్‌ఖర్‌. అప్పటి నుండి మమతా బెనర్జీతో అసలు పొసగటం లేదు. ఇద్దరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. గవర్నర్ ధన్​కర్​ను తొలగించాలని బడ్జెట్ సమావేశాల తొలిరోజున రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​కు విజ్ఞప్తి చేశానని చెప్పారు టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్​. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News