February New Rules: ఫిబ్రవరి 1 , రేపటి నుంచి మారనున్న కొత్త రూల్స్, నిబంధనలు ఇవే

February New Rules: రోజు మారితే తేదీ ఒక్కటే మారదు. నియమ నిబంధనలు కూడా మారుతుంటాయి. ఫిబ్రవరి వచ్చేసింది. కొత్త రూల్స్ అమల్లోకొచ్చేస్తాయి. రేపట్నించి అంటే ఫిబ్రవరి 1 నుంచి మీ దైనందిక జీవితంలో వచ్చే మార్పులు, కొత్త నియమ నిబంధనలు తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 31, 2022, 01:30 PM IST
February New Rules: ఫిబ్రవరి 1 , రేపటి నుంచి మారనున్న కొత్త రూల్స్, నిబంధనలు ఇవే

February New Rules: రోజు మారితే తేదీ ఒక్కటే మారదు. నియమ నిబంధనలు కూడా మారుతుంటాయి. ఫిబ్రవరి వచ్చేసింది. కొత్త రూల్స్ అమల్లోకొచ్చేస్తాయి. రేపట్నించి అంటే ఫిబ్రవరి 1 నుంచి మీ దైనందిక జీవితంలో వచ్చే మార్పులు, కొత్త నియమ నిబంధనలు తెలుసుకుందాం.

రోజువారీ జీవితంలో ఎప్పటికప్పుడు వివిధ అంశాలకు సంబంధించి నియమ నిబంధనలు మారుతుంటాయి. బ్యాంకు లావాదేవీలు కావచ్చు, ఎల్పీజీ సిలెండర్ ధర కావచ్చు, పన్నులు కావచ్చు ఇలా నెల మారితే ఒక్కోసారి రూల్స్ కూడా మారిపోతుంటాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి నెల నుంచి అంటే రేపటి నుంచి వివిధ అంశాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రేపటి నుంచి దైనందిక జీవితానికి సంబంధించి ఏయే అంశాల్లో ఏ మార్పులు వస్తున్నాయో తెలుసుకుందాం.(New Rules and Changes from February 1, 2022 in Sbi, Bank of Baroda, Covid Restrictions and Lpg Cylinder prices)

SBI IMPS Chargesకు సంబంధించి రేపట్నించి మార్పులు రానున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎంపీఎస్ లావాదేవీల్లో కొత్త శ్లాబ్‌ను అదనంగా చేర్చింది. ఇప్పటి వరకూ IMPS విధానం ద్వారా 2 లక్షల రూపాయలే బదిలీ చేసే అవకాశముండేది. ఇప్పుడీ పరిధిని 5 లక్షల వరకూ పెంచింది. కొత్త IMPS శ్లాబ్ 2022, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే 2 లక్షల నుంచి 5 లక్షల మధ్య జరిపే లావాదేవీలకు 20 రూపాయలు సర్వీస్ ఛార్జ్‌తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక రేపట్నించి మారుతున్న మరో అంశం ఎల్పీజీ ధరలు. ఎందుకంటే ఎల్పీజీ ధరలు ప్రతి నెలా మారుతుంటాయి. ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలెండర్ ధరల్ని సవరిస్తుంటాయి. రేపట్నించి సిలెండర్ ధర పెరుగుతుందా లేదా అలాగే ఉంటుందా అనేది సాయంత్రంలోగా తేలనుంది. 

ఇక  Bank of Baroda లావాదావీలు విషయంలో రూల్స్ మారుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్ పేమెంట్ విషయంలో కొత్త నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్తగా పాజిటీవ్ పే విధానాన్ని అమలు చేస్తోంది. 10 లక్షల కంటే ఎక్కువ చెక్ పేమెంట్స్‌కు ఈ విధానం వర్తిస్తుంది. అంటే చెక్ క్లియర్ చేసేముందు చెక్ జారీ చేసినవారిని అలర్ట్ చేయడంతో పాటు వారి అప్రూవల్ తీసుకోనుంది. ఇక Punjab National Bankకూడా కొత్తగా ఛార్జీలు విధిస్తోంది. ఈఎంఐ లేదా ఇతర ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ ఫెయిల్ అయితే కస్టమర్లు 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వాయిదా చెల్లించాల్సిన తేదీనాటికి అకౌంట్‌లో సరిపడా డబ్బులు ఉండాలి. గతంలో వంద రూపాలున్న ఛార్జీ రేపట్నించి 250 రూపాయలవుతోంది.

అన్నింటికంటే ముఖ్యమైంది యూనియన్ బడ్జెట్. రేపు అంటే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో సామాన్య ప్రజలతో పాటు అన్ని వర్గాలు, అన్ని రంగాలకు వరాలు ఉంటాయన్న వార్తలొస్తున్నాయి. రైతులు, పన్ను చెల్లింపుదారులు, మధ్యతరగతి ప్రజలు... ఇలా ఎవరికి ఏం లభిస్తుందనేది రేపు తేలనుంది. 

మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువను సవరించింది. ఫిబ్రవరి 1న కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50 శాతం, ఖాళీ స్థలాల మార్కెట్ విలువ 35 శాతం, అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువ 25 శాతం పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ రేపటి నుంచి కోవిడ్ ఆంక్షల్లో సడలింపులు వస్తున్నాయి. రేపట్నించి తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో విద్యాలయాలు తిరిగి తెర్చుకోనున్నాయి. పూరీ జగన్నాథ ఆలయం భక్తుల సందర్శనార్ధం తెర్చుకోనుంది. 

Also read: All in One Digital ID: ఒక్కొక్క పనికి ఒక్కో ఐడీ కార్డు..ఇబ్బందే..త్వరలో ఆల్ ఇన్ వన్ డిజిటల్ ఐడీ కార్డు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News