Biperjoy Video: బిపర్‌జోయ్ బీభత్సం, వంతెనను మింగేసిన రాకాసి కెరటాలు, వీడియో వైరల్

Biperjoy Video: అరేబియా సముద్రంలో దీర్ఘకాలం కొనసాగిన అత్యంత తీవ్రమైన తుపాను బిపర్‌జోయ్. తీరం దాటే ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో గుజరాత్‌లో బీభత్సం జరుగుతోంది. భారీ వర్షాలు, రాకాసి అలలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. రాకాసి అలలు గుజరాత్‌లోని ఓ వంతెనను ఎలా మింగేస్తున్నాయో ఈ వీడియో చూడండి

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 16, 2023, 12:08 AM IST
Biperjoy Video: బిపర్‌జోయ్ బీభత్సం, వంతెనను మింగేసిన రాకాసి కెరటాలు, వీడియో వైరల్

Biperjoy Video: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను ఇప్పటికే తీరం తాకేసింది. గుజరాత్ కచ్ సమీపంలో ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ పాకిస్తాన్ కరాచీ తీరం వరకూ కొనసాగనుంది. కచ్, కరాచీ తీరాల్ని అతలాకుతలం చేస్తున్న బిపర్‌జోయ్ ధాటికి రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. రాకాసి కెరటాలు వంతెనను మింగేస్తున్న వీడియో చూస్తే చాలు..పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఒక్క బిపర్‌జోయ్ సైక్లోన్ ఐ వ్యాసార్ధమే 50 కిలోమీటర్ల పరిధిలో ఉందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అరేబియా సముద్రంలో ఏ విధంగానైతే సుదీర్ఘకాలం బిపర్‌జోయ్ సైక్లోన్ కొనసాగిందో అదే విధంగా తీరం దాటే ప్రక్రియ కూడా సుదీర్ఘంగా 5 గంటలపాటు ఉండనుంది. కచ్ జిల్లా జఖౌ ఓడరేవుకు సమీపంలో మాండ్వి, పాకిస్తాన్ కరాచీ మధ్యలో తీరం దాటనుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం గుజరాత్, కరాచీ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెను గాలులతో విధ్వంసం జరుగుతోంది. లెక్కకు మించిన ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి. పెట్రోల్ బంక్ పైకప్పులు లేచిపోతున్నాయి. సముద్రంలో రాకాసి అలలు ఉవ్వెత్తును ఎగసిపడుతున్నాయి. 3-4 మీటర్ల ఎత్తులో రాకాసి అలలు వచ్చి పడుతున్నాయి. 

కచ్ జిల్లాలో బిపర్‌జోయ్ సైక్లోన్ బీభత్సం ఎక్కువగా ఉంది జఖౌ, మాండ్వి పట్టణాల్లో విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకొరిగాయి. రాకాసి గాలుల కారణంగా అమ్రేలిలోని మోరంగిలో 100 ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మొత్తం చీకటి అలముకుంది. ద్వారకా, ఒఖా, నాలియా, భుజ్ పోరుబందర్, కాండ్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను కారణంగా ఇప్పటికే లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంలో రాకాసి అలల బీభత్సం ఎలా ఉందో చెప్పాలంటే ఈ వీడియో చూస్తే చాలు..

రాకాసి అలలు ఎంత ఎత్తున ఎగురుతున్నాయంటే సముద్రంలో నిర్మించిన ఓ వంతెనను అమాంతం కెరటాలు మింగేసిన దృశ్యం స్పష్టంగా కన్పిస్తోంది. సునామీ నేపధ్యంలో తీసిన సినిమాల్లో సముద్రం ఊర్లను, వంతెనల్ని ఎలా మింగేస్తున్నట్టు చూపిస్తారో అచ్చం అదే జరిగింది. గుజరాత్ తీరంలోని ఓ వంతెనను రాకాసి అలలు మింగేస్తున్న దృశ్యం వైరల్ అవుతోంది. అంతకంటే ఆశ్చర్యమేంటంటే..రాకాసి కెరటాలు వంతెనను ఆక్రమిస్తున్నప్పుడు ...ఇద్దరు వ్యక్తులు ఆ వంతెనపైనే ఉన్నారు. 

Also read: Biperjoy Effect: బిపర్‌జోయ్ విధ్వంసం, గుజరాత్‌లో భారీ వర్షాలు, భీకరమైన గాలులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News