భారత ప్రధానికి జపాన్ కంపెనీ లీగల్ నోటీసులు

జపాన్ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద లీగల్ నోటీసులు జారీ చేసింది. 

Last Updated : Dec 2, 2017, 01:07 PM IST
భారత ప్రధానికి జపాన్ కంపెనీ లీగల్ నోటీసులు

జపాన్ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద లీగల్ నోటీసులు జారీ చేసింది.  ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించి ఈ లీగల్ నోటీసులు పంపించినట్లు కంపెనీ కోరింది. ముఖ్యంగా 5 వేల కోట్ల ప్రోత్సాహకాల బకాయిలు భారత ప్రభుత్వం చెల్లించనందుకే ఈ నోటీసులు పంపిస్తున్నామని కంపెనీ యాజమాన్యం తెలిపింది. వివరాల్లోకి వెళితే.. 2008లో తమిళనాడులో నిస్సాన్ కంపెనీ, కార్ల పరిశ్రమను స్థాపించింది. పరిశ్రమను స్థాపిస్తున్నప్పుడు పలు ప్రోత్సహకాలు కూడా తమ ప్రభుత్వం ఇస్తుందని తమిళనాడు సర్కారు తెలిపింది.

అయితే తర్వాత వాటి విషయమే రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందని.. అటువంటి సందర్భంలో భారత్‌లో పరిశ్రమను నడపడం లాభదాయకం కాదని భావించి, ప్రోత్సాహక బకాయిల చెల్లింపుల విషయాన్ని తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని నిస్సాన్ యాజమాన్యం తెలిపింది. అయితే కేంద్రం కూడా తగు రీతిలో స్పందించకపోవడంతో తాము ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌‌ను ఆశ్రయించి భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద నోటీసులు జారీ చేస్తున్నామని యాజమాన్యం తెలిపింది. 

Trending News