Covid19 vaccine Availability: వ్యాక్సిన్ ఓపెన్ మార్కెట్‌కు రాదు: కేంద్ర ఆరోగ్య శాఖ

Covid19 vaccine Availability: కరోనా వ్యాక్సిన్ ఓపెన్ మార్కెట్‌లో వస్తుందని ఎదురుచూసిన వారికి షాకింగ్ న్యూస్. కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇప్పట్లో బహిరంగ మార్కెట్‌లో వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమం తప్ప మరో మార్గం లేదని స్పష్టమైంది.

Last Updated : Jan 23, 2021, 04:15 PM IST
Covid19 vaccine Availability: వ్యాక్సిన్ ఓపెన్ మార్కెట్‌కు రాదు: కేంద్ర ఆరోగ్య శాఖ

Covid19 vaccine Availability: కరోనా వ్యాక్సిన్ ఓపెన్ మార్కెట్‌లో వస్తుందని ఎదురుచూసిన వారికి షాకింగ్ న్యూస్. కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇప్పట్లో బహిరంగ మార్కెట్‌లో వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమం తప్ప మరో మార్గం లేదని స్పష్టమైంది.

కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) అభివృద్ధి, ఆమోదం తరువాత త్వరలో బయటి మార్కెట్‌లోకి వస్తుందని చాలామంది ఊహించారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్  అనంతరం కాస్త ఆలస్యంగానైనా వస్తుందనుకున్నారు. ధర ఎక్కువైనా సరే కొనుగోలు చేసి వ్యాక్సిన్ తీసుకుందామని మరి కొంతమంది భావించారు. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ ( Union health secretary Rajesh Bhushan ) చేసిన ప్రకటన షాక్ కల్గించింది. కరోనా వ్యాక్సినేషన్ ( Corona vaccination ) ‌ను ఓపెన్ మార్కెట్‌లోకి తీసుకొచ్చే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం దేశంలో ఫ్రంట్‌లైన్ వర్కర్ల ( Frontline workers ) కు తొలిదశ వ్యాక్సినేషన్ జరుగుతోంది. అదే సమయంలో విదేశాలకు సైతం వ్యాక్సిన్ సరఫరా అవుతోంది. తొలి రెండు దశల వ్యాక్సినేషన్ అనంతరం సాధారణ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా వ్యాక్సిన్ ప్రైవేట్ మార్కెట్ విషయంలో నెలకొన్న సందేహాలకు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టత ఇచ్చేసింది. భారతదేశం ఆమోదించిన రెండు వ్యాక్సిన్‌లను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( DCGI ) అనుమతి లభించేవరకూ బయటి మార్కెట్‌లో ప్రవేశపెట్టమని కేంద్రం స్పష్టం చేసింది. నిర్ణీత తేదీలోగా వ్యాక్సిన్‌ను ఓపెన్ మార్కెట్ ( Vaccine in Open Market ) ‌లో ప్రవేశపెట్టే ఆలోచన కూడా లేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. రానున్న 7-8 నెలల్లో దేశంలో అత్యధికమంది ప్రజలకు వ్యాక్సిన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 

Also read: Thanks to india: బ్రెజిల్ ఇండియాకు ధన్యవాదాలు చెప్పిన తీరుకు హ్యాట్సాఫ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News