యూనివర్శిటీలో చెట్టుకి వేళ్లాడుతూ కనిపించిన శవం

యూనివర్శిటీలోని అడవిలో వున్న ఓ చెట్టుకు వేళ్లాడుతూ కనిపించిన శవం కుళ్లిపోయి వుండటం అనేక అనుమానాలకి తావిస్తోంది.

Updated: Jan 2, 2018, 07:55 PM IST
యూనివర్శిటీలో చెట్టుకి వేళ్లాడుతూ కనిపించిన శవం

ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఓ గుర్తుతెలియని శవం కలకలం సృష్టించింది. యూనివర్శిటీలోని అడవిలో వున్న ఓ చెట్టుకు వేళ్లాడుతూ కనిపించిన శవం కుళ్లిపోయి వుండటం అనేక అనుమానాలకి తావిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేకపోతే ఎవరైనా అతడిని హత్య చేసి చెట్టుకి వేళ్లాడదీసి వుంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, ఒకవేళ మృతుడు తానే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి వున్నట్టయితే, శవం కుళ్లిపోయే వరకు ఎవ్వరి కంట పడకుండా వుండదు కదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. 

ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ తరచుగా అనేక మిస్టరీలకి వేదికవుతోంది. ఒకటి మరిచిపోకముందే మరొకటిగా అన్నట్టుగా నిత్యం ఏదో వివాదం యూనివర్శిటీని వార్తల్లో నిలిచేలా చేస్తోంది.