High returns: డిపాజిటర్లకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరిక

RBI Governor Shaktikanta Das about High returns: అధిక మొత్తంలో వచ్చే లాభాల వేటలో పడి అత్యాశతో ఇబ్బందులపాలు కావొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అలాంటి పథకాలు అదే స్థాయిలో ఇబ్బందులు కూడా తీసుకొస్తాయని ఆయన డిపాజిటర్లకు సూచించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 08:58 PM IST
High returns: డిపాజిటర్లకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరిక

RBI Governor Shaktikanta Das about High returns: అధిక మొత్తంలో వచ్చే లాభాల వేటలో పడి అత్యాశతో ఇబ్బందులపాలు కావొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అలాంటి పథకాలు అదే స్థాయిలో ఇబ్బందులు కూడా తీసుకొస్తాయని ఆయన డిపాజిటర్లకు సూచించారు. పెట్టుబడుల విషయంలో ఏది మంచి, ఏది చెడు అనే ఆలోచించుకునే శక్తి, విచక్షణ డిపాజిటర్లకే ఉండాలని.. లేదంటే ఇబ్బందులు తప్పవు అని శక్తికాంత దాస్ హెచ్చరించారు.  

ఏదైనా ఒక బ్యాంకు డిపాజిట్లపై అత్యధిక మొత్తంలో వడ్డీ రేటు (Rate of interest on deposits) ఇస్తామంటే ఆ బ్యాంకులో మీ ధనాన్ని జమ చేసే ముందు మీరే ఆలోచించుకోవాలని.. ఎందుకంటే అలా ఎక్కువ మొత్తంలో లాభం ఇస్తామని చెప్పే వారితో రిస్కు కూడా అంతే ఎక్కువ మొత్తంలో ఉంటుందని హితవు పలికారు. అలాగని అన్ని బ్యాంకులు అదే కోవకు చెందాయని కాదని.. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు అత్యధిక రిటర్నులు అందిస్తున్నప్పటికీ, వాటి ఎంపిక విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోకతప్పదని శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. 

Also read : Flipkart Realme Festive Sale: రూ.200 కంటే తక్కువ ధరకే అందుబాటులోని స్మార్ట్ ఫోన్స్

ఆదివారం జరిగిన డిపాజిటర్స్ ఫస్ట్ (Depositors first) అనే ఈవెంట్‌లో శక్తికాంత దాస్ పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల యాజమాన్యాలు, బోర్డ్ ఆఫ్ బ్యాంక్స్, బ్యాంకుకు చెందిన వివిధ కమిటీలు, ఆడిట్ కమిటీ లేక రిస్కు మేనేజ్మెంట్ కమిటీ.. ఇలా బ్యాంకులోని వ్యవస్థలు ఏవైనా.. అందరి అంతిమ లక్ష్యం ఒక్కటే అయ్యుండాలని బ్యాంకర్స్‌కి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) సూచించారు.

Also read : Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News