మోదీ ఏ దేశానికి ప్రధానిమంత్రి? బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ డీఎంకే నేత స్టాలిన్

డీఎంకే నేత ఎంకే స్టాలిన్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు నరేంద్ర మోదీ ఏ దేశాన్ని పరిపాలిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. 

Last Updated : May 27, 2018, 06:38 PM IST
మోదీ ఏ దేశానికి ప్రధానిమంత్రి? బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ డీఎంకే నేత స్టాలిన్

డీఎంకే నేత ఎంకే స్టాలిన్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు నరేంద్ర మోదీ ఏ దేశాన్ని పరిపాలిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. "తూత్తుకుడిలో జరిగింది చాలా పెద్ద ఘటన. అది భారతదేశంలోనే జరిగింది. ఈ క్రమంలో నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రధాని మంత్రేనా అన్న అనుమానం కలుగుతుంది. లేక వేరే దేశానికి ప్రధానిగా వ్యవహరిస్తున్నారా అన్న భావన కూడా కలుగుతుంది. తమిళనాడులో జరిగిన తూత్తుకుడి ఘటనలో 13 మంది చనిపోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. అయినా ప్రధానిమంత్రిలో ఎలాంటి చలనమూ లేదు. ఆయన ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఆయన పాలనలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి" అని స్టాలిన్ విమర్శించారు.

"మోదీ స్వయంగా వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తే బాగుండేది. లేదా ఎవరైనా కేంద్రమంత్రిని పంపినా సరిపోయేది. అంతెందుకు.. కనీసం మరణించిన వారికుటుంబాలకు సంతాపం తెలిపినా మేము ఆయన అక్కరగల వారని అనుకొనేవాళ్లం. కానీ ఇది సిగ్గుచేటు" అని స్టాలిన్ తెలిపారు.

తూత్తుకుడిలో జరిగిన సంఘటన పై కనీసం స్పందించానికి సమయం లేని మోదీకి, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఛాలెంజ్‌కు స్పందించే సమయం అయితే ఉందని ఇప్పటికే పలువురు భారత ప్రధానిపై విమర్శలు చేసిన క్రమంలో స్టాలిన్ పై వ్యాఖ్యలు చేశారు.

అలాగే స్టాలిన్ తమిళనాడు ప్రభుత్వంపై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "కనీసం సీఎం, డిప్యూటీ సీఎం కూడా ఈ సంఘటన గురించి స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు . మే 29వ తేది నుండి అసెంబ్లీ సమావేశాలు. అక్కడే వారితో మేం తేల్చుకోవాల్సిందే తేల్చుకుంటామని" స్టాలిన్ అన్నారు. 

Trending News