అలా చేస్తే కరోనా వైరస్ రాదు..

'కరోనా వైరస్' పేరు వింటేనే ప్రపంచవ్యాప్తంగా జనం గజ గజా వణికిపోతున్నారు.  70 దేశాలను వణికిస్తున్న 'కరోనా వైరస్' తాజాగా భారత్ లోనూ అడుగు పెట్టింది. దీంతో ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 

Last Updated : Mar 3, 2020, 04:04 PM IST
అలా చేస్తే కరోనా వైరస్ రాదు..

'కరోనా వైరస్' పేరు వింటేనే ప్రపంచవ్యాప్తంగా జనం గజ గజా వణికిపోతున్నారు.  70 దేశాలను వణికిస్తున్న 'కరోనా వైరస్' తాజాగా భారత్ లోనూ అడుగు పెట్టింది. దీంతో ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరోవైపు కరోనా వైరస్ పై రాజకీయ నాయకులు తలో మాట చెబుతున్నారు. అందునా బీజేపీ నాయకులు ఓ అడుగు ముందే ఉన్నారు. 

ఒకరు గోమూత్రం, గోవు పేడ.. కరోనా వైరస్ కు దివ్యౌషధమని ప్రకటించారు. అసోంలో బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రీత్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. తాజాగా అదే పంథాను కొనసాగిస్తూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. యోగా చేయడం ద్వారా కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చంటూ అంటూ ఆయన ఓ ప్రసంగంలో చెప్పారు. యోగా చేయడం వల్ల కరోనా వైరస్ సోకే అవకాశం అసలే లేదని స్పష్టం చేశారు.  రక్తపోటు, గుండెపోటు, కిడ్నీలు పాడైన వాళ్లు కూడా యోగా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయని తెలిపారు. ఈ విధంగా గతంలో నిరూపితమైందని చెప్పారు. అసోంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రీత్ చేసిన వ్యాఖ్యలకు తోడుగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు చేయడంతో పలు రకాలుగా మాట్లాడుతున్నారు. Read Also: కరోనా ఎఫెక్ట్: కొత్త తరహా పలకరింపు   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News