కరోనా వైరస్ ప్రభావంతో పలకరింపులే మారిపోయాయి. ఇదివరకటిలాగా చేతులు కలుపుకోవడం.. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం.. ఆత్మీయంగా కౌగిలించుకోవడం..ఇలా అంతా మారిపోయింది. ఇప్పుడు కొత్త తరహా పలకరింపులు మొదలయ్యాయి.
కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే జనం గజ గజా వణికిపోతున్నారు. వైరస్ దెబ్బకు ఇప్పటికే 3 వేల మంది ప్రాణాలు విడిచారు. మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్.. ఓ అంటు వ్యాధిలా రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే 27 దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ప్రపంచవ్యాప్తంగా 80 వేల మంది పాజిటివ్ లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
చేతులు తాకడం ద్వారా , వైరస్ ఉన్న వారు తుమ్మినా, దగ్గినా ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు. వీలైతే మొత్తంగా తమను తాము పాలథీన్ కవర్లతో కప్పేసుకుంటున్నారు. హెల్మెట్లు ధరిస్తున్నారు. పెంపుడు జంతువులకు ముఖాలకు కూడా మాస్క్‌లు వేస్తున్నారు.
అంతే కాదు పలకరింపులు కూడా మారిపోయాయి. చైనాలో కరోనా ఎఫెక్ట్ కారణంగా చేతులతో పలకరించుకోకుండా కాళ్లతో పలకరించుకునే విధానాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
New way to greet after caronavirus hit NYC #caronavirusoutbreak #NYC pic.twitter.com/CUYilEilyQ
— Angleeyze (@angleeyze) March 2, 2020
ఇక్కడ చూడండి.. ఓ అమ్మాయి ఎలా సిగరెట్ తాగుతుందో..!!
Smoking in Carona virus environment pic.twitter.com/uFtP13jX0p
— Shaista Gomal (@Paklesbian) March 2, 2020