COVID19తో క్షీణించిన టాలీవుడ్ నటి, ఎంపీ న‌వ‌నీత్ కౌర్ ఆరోగ్యం! 

అమరావతి లోక్‌సభ సభ్యురాలు, టాలీవుడ్ నటి నవనీత్ కౌర్ (Navneet Kaur COVID19 Positive) ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమెతో పాటు భర్త, ఎమ్మెల్యే రవి రాణాతో కలిపి మొత్తం 12 మంది కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు.

Last Updated : Aug 11, 2020, 05:24 PM IST
  • నటి నవనీత్ కౌర్ ఆరోగ్యం కరోనాతో క్షీణిస్తోంది
  • ఆమెతో పాటు కలిపి మొత్తం 12 మంది కుటుంబసభ్యులకు కరోనా
  • 2019లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం
COVID19తో క్షీణించిన టాలీవుడ్ నటి, ఎంపీ న‌వ‌నీత్ కౌర్ ఆరోగ్యం! 

లోక్‌సభ సభ్యురాలు, టాలీవుడ్ నటి నవనీత్ కౌర్ (Navneet Kaur COVID19 Positive) ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమెతో పాటు భర్త, ఎమ్మెల్యే రవి రాణాతో కలిపి మొత్తం 12 మంది కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. వీరిని అమరావతి ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. అయితే నవనీత్ కౌర్ ఆరోగ్యం (Navneet Kaur Health Condition) క్షీణిస్తుండటంతో ఆమెను నాగ్‌పూర్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Photos:  అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..

నవనీత్ కౌర్ భర్త, అమరావతి ఎమ్మెల్యే రవి రాణాకు గత వారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో కుటుంబసభ్యులకు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేశారు. నవనీత్ కౌర్ సహా మొత్తం 12 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. కాగా, 2014లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగి ఓటమి పాలైన నవనీత్ కౌర్ 2019లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అమరావతి ఎంపీగా విజయం సాధించారు. RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు  
రానా ఇంట్లో సత్యనారాయణ వ్రతం, పూజలు

అంతకుముందు టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నవనీత్ నటించారు. 2004లో శీను వాసంతి లక్ష్మితో తెలుగు వెండితెరకు పరిచయమైన నవీనీత్.. చివరగా 2010లో కాలచక్రం సినిమాలో కనిపించారు. ఆ తర్వాత సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  Virat Kohli: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కోహ్లీ.. కానీ ఓ కండీషన్

Trending News