Taj Mahal Temple: తాజ్‌మహల్‌పై మళ్లీ అదే వివాదం.. శివాలయంగా ప్రకటించాలని డిమాండ్‌

TaJ Mahal Declare As Shiva Temple: దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రేమికుల చిహ్నం.. పాలరాతి సుందర నిర్మాణం తాజ్‌ మహల్‌ను ఆలయంగా మార్చాలనే డిమాండ్‌ మళ్లీ వచ్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 28, 2024, 08:10 PM IST
Taj Mahal Temple: తాజ్‌మహల్‌పై మళ్లీ అదే వివాదం.. శివాలయంగా ప్రకటించాలని డిమాండ్‌

Taj Mahal: ప్రేమికులకు చిహ్నంగా.. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌ మహల్‌పై దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. ఆ కట్టడం సమాధి అని, ఆలయం కూల్చేసి ఆ నిర్మాణం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ వర్గానికి చెందిన వారు తాజ్‌మహల్‌ను కూల్చేసి అక్కడ మందిరం నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ఇదే కోరిక కోరుతూ ఆగ్రా కోర్టులో పిటీషన్‌ వేశారు. 'తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలి' అని కోర్టులో విన్నవించారు. దీంతో మరోసారి తాజ్‌మహల్‌ వివాదం తెరపైకి వచ్చింది.

Also Read: Barrelakka Marriage: అంగరంగ వైభవంగా బర్రెలక్క రెండో వివాహం.. తరలివచ్చిన సోషల్‌ మీడియా అతిథులు

తాజ్‌మహల్‌ అంశంపై ఆగ్రా కోర్టులో బుధవారం శ్రీభగవాన్‌ శ్రీ తేజో మహాదేవ్‌ పోషకుడు అజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ ఫిర్యాదు చేశాడు. 'తాజ్‌మహల్‌ను తేజో మహాలయ, శివాలయంగా ప్రకటించాలి. ఆ నిర్మాణంలో అన్ని ఇస్లామిక్‌ కార్యకలాపాలను నిలిపివేయాలి. ప్రార్థనా స్థలానికి అనువైన ఇతర పద్ధతులను ఆపేయాలి' అని పిటిషన్‌లో ఆయన కోరాడు. పిటిషన్‌ను అనూహ్యంగా ఆగ్రా కోర్టు విచారణకు స్వీకరించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఏప్రిల్‌ 9వ తేదీన విచారించేందుకు ఆగ్రా కోర్టు సమ్మతించింది. తాజ్‌మహల్‌ కట్టడం కన్నా ముందు ఆ ప్రదేశంలో తేజో మహాలయ శివాలయం ఉందని కొన్ని ఆధ్యాత్మిక, మత సంస్థలు ఆరోపిస్తున్నాయి. శివాలయంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. ఈ విషయమై చాలా న్యాయస్థానాల్లో పిటిషన్లు వచ్చాయి. కొన్ని కోర్టులు ఈ కేసులను కొట్టివేసిన విషయం తెలిసిందే. 

Also Read: Telangana Drought: యాత్రలు.. జాతరలు తప్పితే రేవంత్ సీఎంగా చేసిందేమీ లేదు: కేటీఆర్‌

తాజాగా సవాల్‌ చేసిన వ్యక్తి స్వయంగా న్యాయవాది అజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ కేసు వేయడం విశేషం. ఆయన శ్రీభగవాన్‌ శ్రీ తేజో మహాదేవ్‌ పోషకుడిగా, యోగేశ్వర్‌ శ్రీ కృష్ణ జన్మస్థాన్‌ సేవా సంఘ్‌ ట్రస్ట్‌, క్షత్రియ శక్తిపీఠ్‌ వికాస్‌ ట్రస్ట్‌గా అజయ్‌ పని చేస్తున్నాడు. గతంలో చాలా మంది పిటిషన్లు వేయగా.. అజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ మాత్రం ఈసారి పక్కా ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా కొన్ని చారిత్రక పుస్తకాలను ఆధారాలుగా కోర్టు ముందు ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో చాలా చారిత్రక ప్రదేశాల కింద ఆలయాలు ఉన్నాయనే డిమాండ్ వస్తోంది. అయోధ్య వివాదం ముగిసి ఆలయం నిర్మాణం కావడంతో అదే మాదిర మరికొన్ని వివాదాస్పద అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే జ్ణానవాపి, మధుర వివాదాలు చుట్టుముట్టగా.. తాజాగా ఆ వివాదం తాజ్‌ మహల్‌ను చుట్టుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News