India-China standoff: చైనా సైన్యమే గాల్లోకి కాల్పులు జరిపింది: భారత సైన్యం

భారత్-చైనా సైన్యం మధ్య సోమవారం అర్థరాత్రి కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చైనా మరో ముందడుగు వేసి.. భారత సైన్యమే వాస్తవ నియంత్రణ రేఖను దాటి కాల్పులు జరిపిందంటూ మంగళవారం ఉదయం ఆరోపించింది. అయితే.. చైనా ఈ ప్రకటనను భారత ఆర్మీ ఖండించింది. 

Last Updated : Sep 8, 2020, 02:18 PM IST
India-China standoff: చైనా సైన్యమే గాల్లోకి కాల్పులు జరిపింది: భారత సైన్యం

Indian Army didn't cross LAC: న్యూఢిల్లీ‌: భారత్-చైనా సైన్యం మధ్య సోమవారం అర్థరాత్రి కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చైనా మరో ముందడుగు వేసి.. భారత సైన్యమే వాస్తవ నియంత్రణ రేఖను దాటి కాల్పులు జరిపిందంటూ మంగళవారం ఉదయం ఆరోపించింది. అయితే.. చైనా ఈ ప్రకటనను భారత ఆర్మీ ఖండించింది. చైనా కావాలనే ఇలా చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎల్ఏసీ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు భారత్ ప్రయత్నిస్తుందని, ఈ మేరకు చర్చలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. ఇండియ‌న్ పొజిష‌న్స్‌కు స‌మీపంగా పీఎల్ఏ ద‌ళాలే ముందుకు వ‌చ్చి గాలిలోకి కాల్పులు జ‌రిపిన‌ట్లు భారతసైన్యం ప్రకటించింది. పాన్‌గాంగ్ స‌రస్సు వ‌ద్ద తమ ద‌ళాలు ఎల్ఏసీ నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌లేద‌ని.. చైనా దళాలే ఉల్లంఘిస్తూ దుకుడుగా ప్రవర్తిస్తున్నాయని ఆర్మీ పేర్కొంది. Also read: India-China standoff: భారత్-చైనా సైన్యం మధ్య కాల్పులు..!

దేశ‌, అంతర్జాతీయ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిచేందుకు చైనా ఇలాంటి త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేస్తోందని ఈ మేరకు రక్షణ శాఖ వెల్లడించింది. భార‌త సైన్యం వాస్త‌వాధీన రేఖ‌ను దాట‌లేద‌ని.. ఎలాంటి క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు కూడా పాల్ప‌డ‌లేద‌ని వెల్ల‌డించింది. చైనా ద‌ళాలు చాలాసార్లు దూకుడుగా వ్య‌వ‌హ‌రించినా తాము మాత్రం సంయమనం పాటించినట్లు వెల్లడించింది. అయితే దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో ఎలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని రక్షణ శాఖ మరోసారి స్పష్టంచేసింది. Also read: Indian Army: దారి తప్పిన చైనా పౌరులను ఆదుకున్న భారత సైన్యం

Trending News