D Raja: భారత్‌ ఒక దేశమే కాదు.. తమిళనాడు ఒక దేశం: ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు

India Not A Nation: గతంలో తమిళనాడు మంత్రి సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మరో నాయకుడు అలాంటి వ్యాఖ్యలే చేయడంతో దేశంలో తీవ్ర దుమారం రేపాయి. దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 5, 2024, 06:47 PM IST
D Raja: భారత్‌ ఒక దేశమే కాదు.. తమిళనాడు ఒక దేశం: ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు

D Raja Comments: తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకులు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై తీవ్ర వ్యాఖ్యల మరువకముందే అదే పార్టీకి చెందిన ఎంపీ డి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం దేశం కాదంటూ వ్యాఖ్యానించారు. అసలు ఇండియా ఒక దేశం కాదని.. తమిళం, మలయాళం దేశాలు అని పేర్కొన్నాడు. భారత్‌ అనేది ఒక ఉపఖండంగా అభివర్ణించారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయితే దేశానికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Kalpana Soren: భర్తను తలచుకుని ప్రజల మధ్య కన్నీరు పెట్టుకున్న మాజీ సీఎం భార్య

'భారత్‌ ఒక దేశం కాదు. ఎప్పుడూ ఒక దేశంగా లేదు. ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి వంటి లక్షణాలు ఉంటే ఒకే దేశం అంటారు. కానీ.. భారతదేశం అలా కాదు. భిన్న భాషలు, విభిన్న సంస్కృతులు ఉన్న రాష్ట్రాలు కలిసి దేశంగా ఏర్పడ్డాయి. అందుకే ఇది దేశం కాదు. భారత్‌ అనేది ఉపఖండం. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. తమిళం ఒక దేశం. మలయాళం ఒక భాష.. ఒక దేశం. ఒరియా కూడా దేశం. తమిళం, మణిపూర్‌, ఒరియా ఇలా ఒక్కోటి ఒక్కో సంస్కృతి కలిగి ఉంది. ప్రతి భాష, సంస్కృతి కలిగినవి ఒక దేశమే. ఇందులో తప్పేమీ లేదు' అని తెలిపాడు.

Also Read: River Metro: దేశంలోనే తొలిసారిగా జలమార్గంలో మెట్రో రైలు.. నదిలో రైలు విశేషాలు ఇలా

రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పరస్పర విమర్శలు మొదలయ్యాయి. డీఎంకే నుంచి ఇటువంటి విద్వేష ప్రసంగాలు వస్తూనే ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల వివాదం మరువకముందే మళ్లీ అలాంటి వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచి రావడం శోచనీయమని పేర్కొన్నారు. రాజా చేసిన వ్యాఖ్యలై కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఇండియా కూటమి పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

అతడి వ్యాఖ్యలు దుమారం రేపుతుండడంతో కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. 'రాజా వ్యాఖ్యలతో ఏమాత్రం ఏకీభవించడం లేదు. వందశాతం తప్పు. ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాం. ఎవరైనా ఏదైనా మాట్లాడేప్పుడు సంయమనం పాటించాలి' అని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ తెలిపారు. రాజా వ్యాఖ్యలపై అమిత్‌ మాలవీయ, తేజస్వీ యాదవ్‌, కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తదితరులు స్పందించారు. దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అందరూ అతడి వ్యాఖ్యలను ఖండించాలని పిలుపునిచ్చారు.  రాజకీయాలకతీతంగా రాజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇండియా కూటమి పక్షాలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నాయి. నాయకులు మాట్లాడే ముందు ఒక్కోసారి ఆలోచించి మాట్లాడాలని హితవు పలుకుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News