River Metro: దేశంలోనే తొలిసారిగా జలమార్గంలో మెట్రో రైలు.. నదిలో రైలు విశేషాలు ఇలా

Under River Metro Specialites: ఇన్నాళ్లు ఆకాశంలో.. భూగర్భంలో మెట్రో రైళ్లు నడవడం చూశారు.. తొలిసారి జలమార్గంలో మెట్రో రైలు నడవనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మార్గం ఎక్కడ.. ఏమిటి ప్రత్యేకతలు....

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 5, 2024, 05:51 PM IST
River Metro: దేశంలోనే తొలిసారిగా జలమార్గంలో మెట్రో రైలు.. నదిలో రైలు విశేషాలు ఇలా

Under River Metro: దేశంలో మరో అరుదైన అద్భుతం అందుబాటులోకి రానుంది. ఇన్నాళ్లు మెట్రో రైళ్లు ఆకాశ మార్గంలో.. భూగర్భంలో ప్రయాణించగా తొలిసారిగా జలమార్గంలో ప్రయాణించనుంది. నీటిలో ప్రయాణించే మెట్రో రైలు ప్రారంభానికి సిద్ధమైంది. దీంతో దేశమంతా ఈ రైలుపైనే చర్చ జరుగుతోంది. దేశంలోనే తొలిసారిగా జలమార్గంలో రైలు వ్యవస్థ ప్రారంభం కావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కత్తాలో ఈ రైలు ప్రారంభం కానుంది. 

Also Read: Lock In Assembly: ఎమ్మెల్యేలు పారిపోకుండా అసెంబ్లీకి తాళం వేయండి.. స్పీకర్‌కు తాళం ఇచ్చిన సీఎం

ప్రఖ్యాత నగరాలన్నీ నదీ వ్యవస్థ మైదానంలో ఏర్పడిన విషయం తెలిసిందే. కోల్‌కత్తా కూడా హుగ్లీ నది ఒడ్డున ఏర్పడింది. దేశంలోని అతి ప్రాచీన నగరాల్లో కోల్‌కత్తా ఒకటి. ఈ నగరం చుట్టూ హుగ్లీ నదీ ఉంది. ఈ నదిలో కూడా రవాణా వ్యవస్థ ఏర్పాటుచేయాలని కోల్‌కత్తా మైట్రో రైలు అధికారులు భావించారు. కొత్తగా నిర్మిస్తున్న మెట్రో మార్గంలో హుగ్లీ నదీ మార్గం గుండా లైన్‌ను తీసుకెళ్లారు. తూర్పు-పశ్చిమ ప్రాంతాన్ని కలుపుతూ ఈ మార్గాన్ని నిర్మించారు. ఈ రైలు మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం (మార్చి 6)న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రైలు ప్రత్యేకతలు తెలుసుకుందాం.

Also Read: Kalpana Soren: భర్తను తలచుకుని ప్రజల మధ్య కన్నీరు పెట్టుకున్న మాజీ సీఎం భార్య

మెట్రో నిర్మాణం
ఎక్కడ:
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తా నగరంలో.
మార్గం: ఎస్ప్లానేడ్‌ నుంచి హౌరా స్టేడియం వరకు
మొత్తం కిలోమీటర్లు: 16 కిలోమీటర్లు
నీటి మార్గం: 4.8 కిలోమీటర్లు
రైలు సమయం: ప్రతి 12 నిమిషాలకు ఒక రైలు.

రైలు ప్రత్యేకతలు

  • కోల్‌కత్తా మార్గంలో తొలి టన్నెల్‌ రైల్వే మార్గం ఇది. హౌరా మెట్రో స్టేషన్‌ అత్యంత లోతైనది. 
  • తూర్పు-పశ్చిమ ప్రాంతాన్ని ఈ రైలు మార్గాన్ని కలుపుతుంది.
  • కోల్‌కత్తా మెట్రో ఏప్రిల్‌ 2023లో చరిత్ర సృష్టించింది. భారతదేశంలోనే తొలిసారిగా హుగ్లీ నదీ తీరంలో టన్నెల్‌ నిర్మించింది.
  • హౌరా మైదాన్‌, ఎస్ప్లానేడ్‌, ఐటీ హబ్‌ సాల్ట్‌ లేక్‌ సెక్టర్‌ వీని ఈ మార్గం కలుపుతుంది.
  • హుగ్లీ నదిలో ఒకానొక దశలో మెట్రో రైలు 520 మీటర్ల లోతుకు 45 సెకండ్ల వరకు వెళ్తుంది.
  • డ్రైవర్‌ రహిత రైలు వ్యవస్థ. ఆటోమేటిక్‌ ట్రైన్‌ ఆపరేషన్‌ వ్యవస్థతో ఈ రైలును నడుపుతున్నారు.
  • ఈ రైలు మార్గంతో అనేక ప్రాంతాలకు రవాణా సులువు కానుంది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య దూర భారం తగ్గనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News