Mohan Bhagwat: భారత ముస్లింలు అత్యంత సంతోషంగా ఉన్నారు

ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశ ముస్లింలు (Indian Muslims) చాలా సంతృప్తికరంగా.. సంతోషంగా ఉన్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పేర్కొన్నారు. దేశానికి అవసరం వచ్చినప్పుడు విశ్వాసాలన్నింటినీ పక్కకు బెట్టి అన్ని మతాల వారు ఏకతాటిపైకి వచ్చారని ఆయన తెలిపారు.

Last Updated : Oct 10, 2020, 01:53 PM IST
Mohan Bhagwat: భారత ముస్లింలు అత్యంత సంతోషంగా ఉన్నారు

Indian Muslims most content in world: RSS chief Mohan Bhagwat: న్యూఢిల్లీ: ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశ ముస్లింలు (Indian Muslims) చాలా సంతృప్తికరంగా.. సంతోషంగా ఉన్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పేర్కొన్నారు. దేశానికి అవసరం వచ్చినప్పుడు విశ్వాసాలన్నింటినీ పక్కకు బెట్టి అన్ని మతాల వారు ఏకతాటిపైకి వచ్చారని ఆయన తెలిపారు. ఇలా ప్రపంచంలో ఎక్కడా లేదని.. కేవలం భారత దేశంలో మాత్రమే ఉందని.. మహారాష్ట్రకు చెందిన ఒక హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ భగవత్ ఈ విధంగా పేర్కొన్నారు. దేశంలో మూర్ఖత్వం, వేర్పాటువాదం కేవలం స్వలాభం కోసం పరితపించే వారికి మాత్రమే వ్యాపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే పురాతన కాలంలో.. మేవార్‌ రాజు మహారాణా ప్రతాప్‌ అండగా.. సైన్యంలో అనేక మంది ముస్లింలు మొఘల్‌ సామ్రాజ్యాధినేత అక్బర్‌కు వ్యతిరేకంగా పోరాడారని ఆర్ఎస్ఎస్ (Rashtriya Swayamsevak Sangh) చీఫ్ గుర్తుచేశారు. Also read: Mike Pompeo: భారత సరిహద్దులో 60వేల మంది చైనా సైనికులు

దేశ సంస్కృతి మీద దాడి జరిగినప్పుడల్లా భారతదేశ చరిత్రలో అన్నిమతాల వారు ఐక్యంగా నిలబడి తిప్పి కొట్టారని .. కలిసి పోరాడటం భారతీయ సంస్కృతిలో భాగమని భగవత్ కొనియాడారు. భారత్‌ లాగా.. పాకిస్తాన్‌ ఇతర మతస్తులకు ఎలాంటి హక్కులు కల్పించకుండా.. మనవత్వాన్ని మంటగలుపుతుందని ఆయన ఆగ్రహంవ్యక్తంచేశారు. అయితే భారత్‌లో హిందువులు మాత్రమే ఉండాలని మన రాజ్యాంగం చెప్పలేదని, కానీ ఇక్కడ ఉండాలంటే మాత్రం హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనని భగవత్ పేర్కొన్నారు. దీంతోపాటు అయోధ్యలోని రామ మందిరం గురించి భగవత్.. మందిరం జాతీయ విలువలకు, స్వభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. Also read: Harthras Case: హత్రాస్ బాధిత కుటుంబానికి భారీ భద్రత

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News