గోవా విమానాశ్రయంలో కుప్పకూలిన యుద్ధ విమానం

భారత నావికాదళానికి చెందిన మిగ్ -29కే యుద్ధవిమానం గోవాలో కుప్పకూలింది. గోవా విమానాశ్రయం వద్ద రన్వేపై కుప్పకూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Updated: Jan 3, 2018, 02:26 PM IST
గోవా విమానాశ్రయంలో కుప్పకూలిన యుద్ధ విమానం

భారత నావికాదళానికి చెందిన మిగ్ -29కే యుద్ధవిమానం గోవాలో కుప్పకూలింది. గోవా విమానాశ్రయం వద్ద రన్వేపై కుప్పకూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.  ఆ సమయంలో విమానంలో ట్రైనీ పైలెట్ ఉన్నాడు. అతను సురక్షితంగా బయటపడి సిబ్బందికి సమాచారం అందించారు.  మంటలను ఆర్పేందుకు అత్యవసర బృందం రంగంలోకి దిగింది.

నావికా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, "గోవా ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటన మధ్యాహం 12 గంటల ప్రాంతంలో గోవాలోని డబోలిం విమానాశ్రయం వద్ద చోటుచేసుకుంది" అన్నారు.