రైళ్లు రద్దు.. ఆ ప్రయాణికులకు గుడ్ న్యూస్

టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ నగదు ఎలా అని కంగారు చెందాల్సిన పనిలేదంటూ ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. ఆన్ లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసుకోకుండానే పూర్తి నగదు ప్రయాణికులకు అందిస్తామని ప్రకటించింది.

Last Updated : Mar 25, 2020, 11:07 AM IST
రైళ్లు రద్దు.. ఆ ప్రయాణికులకు గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారిని అరికట్టడంలో భాగంగా కేంద్ర రైల్వేశాఖ మార్చి 31 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. అయితే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ నగదు ఎలా అని కంగారు చెందాల్సిన పనిలేదంటూ ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. ఆన్ లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసుకోకుండానే పూర్తి నగదు ప్రయాణికులకు అందిస్తామని ప్రకటించింది. ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సెలవుల్లోనూ పూర్తి జీతం

తొలుత రైళ్లు రద్దు చేసిన సమయంలో అయితే జూన్ 21 వరకు ఆ టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకునే అవకాశం కల్పించడం తెలిసిందే. రైళ్లు రద్దు చేశారు, టిక్కెట్ల నగదు ఎలా అని కంగారు అక్కర్లేదని ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ భరోసానిచ్చింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ ప్రకటన చేసింది. టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆటోమేటిక్‌గా ప్రయాణికుల ఖాతాలోకి నగదు చేరేలా చూస్తామని ప్రకటనలో పేర్కొంది.  హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos

ఆన్‌లైన్‌ టిక్కెట్ బుక్ ఏ అకౌంట్ ద్వారా బుక్ చేసుకున్నారో అదే కాతాలోకి నగదు అందజేస్తామని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు తొలుత రైళ్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అనంతరం విమానాలు, ఇరత్రా రవాణా సదుపాయాలను రద్దు చేసింది. తాజాగా ఏప్రిల్ 14వరకు ప్రధాని మోదీ దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

Trending News