న్యూఢిల్లీ: కరోనా వైరస్ (CoronaVirus) ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ లేక ఇళ్లల్లోనే ఉండాలంటూ పలు దేశాలు కరోనా వైరస్ లాక్ డాన్ ప్రకటించాయి. మరికొన్ని దేశాలు సైతం అదే ఆలోచనలో పడ్డాయి. అయితే వర్క్ ఫ్రమ్ చేయడానికి వీలులేని ఉద్యోగులు తమ జాబ్ పోతుందేమోనని, వేతనాల్లో కోత విధిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిస్తూ తీపి కబురు అందించింది. మనసున్న మారాజు.. ప్రకాష్ రాజ్
లాక్ డౌన్ సమయంలో సెలవుపై వెళ్లిన ఉద్యోగులకు, ఇంటి నుంచి పనిచేయడానికి వీలులేని ఉద్యోగుల వేతనాలలో కోత విధించరాదని ఆన్ డ్యూటీ కింద పరిగణించాలని కేంద్ర కార్మిక శాఖ తాజాగా ప్రభుత్వ సంస్థలను ఆదేశించింది. ప్రైవేట్ కంపెనీలకు సూచించింది. కార్మిక శాఖ కార్యదర్శి హెచ్‌కే స్మారియా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, సంబంధిత మంత్రిత్వ శాఖలకు లేఖలో ఈ విషయాలు పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
వైరస్ గుప్పిట్లో ప్రపంచం.. 16వేలు దాటిన కరోనా మరణాలు
ప్రైవేట్ సంస్థలు ఎంతమేరకు పాటిస్తాయన్నది చెప్పలేము. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆఫీసులకు వెళ్లలేకపోతున్నారు. అయితే వీరు లాక్ డౌన్ సమయంలో సెలవుపై వెళ్లినా, పని చేయలేకపోయినా వేతనాల్లో ఏ కోత ఉండదని ఏప్రిల్ 30వరకు ఇది వర్తిస్తుందని సమాచారం. ఉద్యోగులను తొలగించవద్దని ఆయా శాఖలకు రాసిన లేఖలో పేర్కొనడం గమనార్హం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos