Voting Mark on Finger: ఓటరు వేలికి పెట్టిన సిరా చుక్కా ఎందుకు చెరిగిపోదు.. ? ఇది ఎక్కడ తయారు చేస్తారో తెలుసా..!

Voting Ink History : ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 17 సార్లు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. ఈ సారి 18వ లోక్ సభకు ఎన్నుకోవడానికి ఎన్నికల జరుతున్నాయి. అయితే.. ఎన్నికల్లో ఓటరు వేలికి సిరా గుర్తును ఎందుకు చెరిగిపోదు.. ఇది ఎక్కడ తయారు చేస్తారనే విషయానికొస్తే..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 15, 2024, 03:25 PM IST
Voting Mark on Finger: ఓటరు వేలికి పెట్టిన సిరా చుక్కా ఎందుకు చెరిగిపోదు.. ? ఇది ఎక్కడ తయారు చేస్తారో తెలుసా..!

Voting Ink History - Lok Sabha Elections 2024: భారత దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఓటు వేసిన ప్రతి ఒక్క ఒటరు వేలిపై సిరా చుక్కా పెడతారు. మనం ఓటు వేశామనే దానికి సిరా చుక్కను ఓ గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లు వేయకుండా చెక్ పెట్టే మిస్సైల్ అని చెప్పాలి. దీని ద్వారా ఓటరు మళ్లీ మళ్లీ ఓటు వేయడానికి రిగ్గింగ్‌కు పాల్పకుండా ఉండటానికి ఈ సిరా చుక్కా వీలు కల్పిస్తోంది.  ఈ ఎలక్టోరల్ ఇంక్ ఓటింగ్‌లో మోసాల నుంచి రక్షించడానికి పనికొస్తోంది. ఇక ఎన్నికల్లో యూజ్ చేసే సిరాను చెరగని సిరా అంటారు. ఒకసారి వేలిపై సిరా పడితే..కొన్ని వారాల పాటు చెరిగిపోదు. అసలు ఈ సిరా చుక్కా తొలిసారి ఏ ఎన్నికల్లో ఉపయోగించారు. అది ఎందుకు చెరిగిపోదు.. దీని ప్రత్యేకతల విషయానికొస్తే...

ఎన్నికల్లో వాడే సిరాను కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (MPVL) అనే కంపెనీ తయారు చేస్తోంది. 1962లో సిరాను ప్రొడ్యూస్ చేయడానికి ఈ కంపెనీకి అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది. నేషనల్ ఫిజికల్ లెబోరేటరీస్ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతలను ఈ కంపెనీకి ఇచ్చారు. అప్పటి నుంచి మొదలు పెడితే.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఈ కంపెనీయే సిరాను సరఫరా చేస్తోంది. ఒక బాటిల్ సిరా ధర సుమారు రూ. 127 ఉంటుంది. ఒక సీసాలో 10ml సిరా ఉంటుంది. ఒక లీటర్ ఎన్నికల సిరా ధ రూ. 12, 700 ఉంటుంది.

ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉండటం వలన ఈ సిరా వేసిన వెంటనే చెరిగిపోదు. 2006 ఫిబ్రవరి 1 నుంచి ఓటరు ఎడమ వేలు చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కింది వరకు సిరా గుర్తు వేస్తున్నారు. అంతకు ముందు గోరు పై భాగపు చర్మంపైనే వేసేవారు. దేశానికి జరిగిన తొలి రెండు ఎన్నికల్లో ఈ సిరా గుర్తు వాడలేదు.
1950లోనే ఈ సిరాపై పేటెంట్‌ను భారత దేశంలోని నేషనల్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (NRDC) పొందింది.  ఆ తర్వాత నీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ)కి చెందిన నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ ఈ ఇంక్‌ను డెవలప్ చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ఇంక్‌ ఉత్పత్తిని మైసూర్‌ లో ఉన్న మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (MPVL) అనే చిన్న కంపెనీకి ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. ఈ కంపెనీని 1937లో అప్పటి మైసూర్ మహారాజా కృష్ణరాజ వడియార్ 4 స్థాపించారు. ఈ కంపెనీ 1962లొ జరిగిన మూడో లోక్ సభ ఎన్నికల సమయంలో ఫస్ట్ టైమ్ ఈ సిరాను మైసూర్ ప్రాంతంలో ఉపయోగించారు. అప్పటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ ఎన్నికల్లో ఈ నీలం సిరా వాడకాన్ని ఎన్నికల్లో చేర్చారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఎక్కడ జరిగినా.. అక్కడ ఈ సిరాను వాడుతున్నారు.
5 mm వయల్.. 300 మందికి సిరా గుర్తు వేయవచ్చు.

మన దేశంలో ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు ఓటర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకొని ఆర్డర్ ఇస్తుంది. వరల్డ్ లార్జెస్ట్ ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఈ సారి దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 30 లక్షల సిరా వయల్స్ వాడుతున్నారు. దీని కోసం రూ.55 కోట్లు ఖర్చు అవసరం.

ఈ ప్రత్యక సిరా తయారీ ఫార్ములా అత్యంత గోప్యంగా ఉంచుతారట. ఎంపీవీఎల్ డైరెక్టర్లకు ఈ ఫార్ములా రహస్యం తెలియకుండా సీక్రెట్ మెయింటెన్ చేస్తున్నారు. ఈ సంస్థలో పనిచేసే ఇద్దరు కెమిస్ట్‌లకు తప్ప ఎవరికీ ఈ ఇంక్ తయారీ విధానం తెలియదట. వాళ్లు లేని సమయంలో నమ్మకస్థులైన తమ తర్వాత ఉద్యోగులకు మాత్రమే ఈ ఫార్ములాను సదురు కెమిస్టులు బదిలీ చేస్తారట.
మన దేశంలో తయారయ్యే ఇంక్‌కు ఇంటర్నేషనల్ లెవల్లో మంచి డిమాండ్ వుంది. మన దేశంలో జరిగే లోక్ సభ, అసెంబ్లీ, మున్సిపల్ కాకుండా.. 1976 నుంచి దాదాపు 30 పైగా దేశాలకు ఈ సిరా ఇక్కడ నుంచి ఎగుమతి అవుతోంది. పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్, నేపాల్, మయన్మార్, ఇరాక్, లెబనాన్, శ్రీలంక, సూడాన్,టర్కీ, ఈజిప్టు వంటి దేశాల్లో జరిగే ఎన్నికల్లో మన దేశపు సిరానే ఉపయోగిస్తున్నారు.

Also Read: Revanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలనం.. రేవంత్‌ రెడ్డికి బీజేపీకిలోకి ఆహ్వానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News