Revanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలనం.. రేవంత్‌ రెడ్డికి బీజేపీలోకి ఆహ్వానం

Dharmapuri Arvind Invites To Revanth Reddy In BJP: ఎన్నికలయ్యాక బీజేపీలోకి రేవంత్‌ రెడ్డి వెళ్తారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. తాజాగా రేవంత్‌ రెడ్డిని బీజేపీలోకి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 15, 2024, 12:01 AM IST
Revanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలనం.. రేవంత్‌ రెడ్డికి బీజేపీలోకి ఆహ్వానం

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. 'ఎన్నికల తర్వాత రేవంత్‌ రెడ్డి బీజేపీలో చేరుతారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వాదిస్తుండడం చర్చనీయాంశమవుతున్న వేళ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్న వాటికి బలం చేకూరుస్తూ రేవంత్‌ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు. 'ఎంతో రాజకీయ జీవితం ఉన్న రేవంత్‌ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం' అని వెల్లడించారు.

Also Read: KTR Vs Revanth Reddy: కేటీఆర్‌ సంచలన ఆరోపణలు.. భట్టి, పొంగులేటి ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ మాట్లాడారు. 'రేవంత్‌ రెడ్డికి చాలా రాజకీయ జీవితం ఉంది. పదిహేన్నేళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు. కానీ ఆయన ఉన్న పార్టీకి మాత్రం భవిష్యత్‌ లేదు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న రేవంత్‌ రెడ్డి అసమర్ధుడుగా ఉన్నాడు. దీనికోసం రేవంత్‌ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నా' అని తెలిపారు. రేవంత్‌ పక్కా హిందూ అయితే జ్ఞానవాపీ, మధురపై తన నిర్ణయమేమిటో చెప్పాలి అని కోరారు. కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా 30 ఎంపీ సీట్లు కూడా రావు అని జోష్యం చెప్పారు.

Also Read: Warangal MP Seat: వరంగల్‌ ఎంపీ అభ్యర్థి ఎంపికపై భారీ ట్విస్ట్‌లు.. ఉద్యమకారుడికి కేసీఆర్‌ అవకాశం

ఆరు గ్యారంటీల విషయంలో ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తోందని అర్వింద్‌ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రేవంత్‌ రెడ్డి మోచేతికి బెల్లం పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను తరిమికొట్టే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పారు. ఉచిత విద్యుత్‌, బోనస్‌ ఇచ్చి వడ్ల కొనుగోలు వంటివి రేవంత్‌ రెడ్డి ఎప్పుడు చేస్తారని నిలదీశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటేనని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News