Gun Firing: రెచ్చిపోయిన ఎమ్మెల్యే.. ఏకంగా పోలీసు స్టేషన్ లోనే కాల్పులు.. కారణం ఏంటంటే..?

Maharashtra: ముంబై సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరపడంపై శివసేన నాయకులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గణపత్ గైక్వాడ్ కళ్యాణ్ తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 3, 2024, 01:18 PM IST
  • - మహరాష్ట్రలో షాకింగ్ ఘటన..
    - ముంబై పోలీస్ స్టేషన్ లో కాల్పులు..
    - అధికారి ముందే కాల్పులు జరిపిన ఎమ్మెల్యే..
Gun Firing: రెచ్చిపోయిన ఎమ్మెల్యే.. ఏకంగా పోలీసు స్టేషన్ లోనే కాల్పులు.. కారణం ఏంటంటే..?

BJP MLA Ganpat Gaikwad Opens Fire: మహరాష్ట్రలోని ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి బీజేపీ ఎమ్మెల్యే, శివసేన నగర్ చీఫ్ పై కాల్పలు జరిపినట్లు సమాచారం.  ఒక స్థల వివాదం విషయం పంచాయతీ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్, శివసేన నగర్ చీఫ్ మహేష్ గైక్వాడ్ ల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో పోలీసు అధికారి క్యాబిన్ లోనే, గణపత్ గైక్వాడ్ కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణ నెలకొంది.

ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సుధాకర్ పఠారే తెలిపారు. భూ వివాదంపై ఇరువర్గాలు ఉల్లాస్‌నగర్‌లోని హిల్‌లైన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అయితే వాడివేడి చర్చల సమయంలో ఎమ్మెల్యే కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన సేన నాయకుడు, మరో మద్దతుదారుని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వ్యక్తుల శరీరం నుండి ఐదు బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకుని బైటపడ్డాయి. ఈ క్రమంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత అదుపులోకి తీసుకున్న గణపత్ గైక్వాడ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ..  మహేశ్ గైక్వాడ్ కబ్జా చేసిన భూమికి సంబంధించి సమస్య ఉందని చెప్పారు.

తన కుమారుడితో దురుసుగా ప్రవర్తించడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఘటనపై మండిపడింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News