Man Raped Dog: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. వీధి కుక్కపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం! వైరల్ వీడియో

Vira Video, Man romance with Stray Dog in Nagpur. పబ్లిక్ ప్లేస్‌లోనే ఓ ఆడ వీధి కుక్కను అత్యాచారం చేశాడో కామాందుడు. ఈ అవమానుష ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 17, 2022, 01:55 PM IST
  • సభ్యసమాజం తలదించుకునే ఘటన
  • వీధి కుక్కపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
  • వైరల్ వీడియో
Man Raped Dog: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. వీధి కుక్కపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం! వైరల్ వీడియో

40 Years old Man Raped Stray Female Dog in Nagpur's Shahu Nagar: ఇప్పటివరకు ఆడ వారిపై మాత్రమే జరిగే లైంగిక వేధింపులు.. ఇప్పుడు జతువులపై కూడా జరుగుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి సభ్యసమాజం తలదించుకునే పని చేశాడు. పబ్లిక్ ప్లేస్‌లోనే ఓ ఆడ వీధి కుక్కను అత్యాచారం చేశాడో కామాందుడు. ఈ అవమానుష ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. వీధి కుక్కపై అత్యాచారం చేసిన 40 ఏళ్ల వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 

నాగ్‌పూర్‌ మానేవాడలోని షాహూనగర్‌లో ఓ పార్క్ ఉంది. ఇదే ప్రాంతంలో మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు. మద్యానికి బానిస అయిన అతడు భవన నిర్మాణ కార్మికుడు. పార్క్ ప్రాంతంలో ఉండే ఓ ఆడ వీధి కుక్కకు అతడు రోజూ బిస్కెట్లు వేస్తూ అన్నం పెడుతున్నాడు. ఈ క్రమంలోనే కుక్కను అతడు మచ్చిక చేసుకున్నాడు. పార్కులో ఎవరూ లేని సమయంలో కుక్కను లోపలికి తీసుకెళ్లి దానితో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టాడు. చాలాకాలం నుంచి అతడు పార్కులో కుక్కతో రొమాన్స్ చేస్తున్నాడు.

ఓ రోజు పార్కులో చుట్టుపక్కల ఎవరు ఉన్నారు అని కూడా చూడకుండా.. ఆ కార్మికుడు కుక్కతో కామం తీర్చుకున్నాడు. కుక్కను అత్యాచారం చేయడం చూసిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. జంతు సంరక్షక సంస్థలు హుద్కేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి.. కుక్కతో రొమాన్స్ చేసిన  కార్మికుడి కోసం గాలించారు. చివరకు శుక్రవారం ఆ కామాంధుడిని అరెస్ట్ చేశారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay)

వీధి కుక్కపై అత్యాచారం చేసిన కామాంధుడిపై సెక్షన్ 377 (ప్రకృతి క్రమానికి వ్యతిరేకంగా శారీరక సంబంధం), 294 (అశ్లీలత), భారతీయ శిక్షాస్మృతి మరియు జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశామని హుద్కేశ్వర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ లలిత్ వర్తికర్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందిన వ్యక్తిగా అతడిని గుర్తించామని, అతడు మద్యానికి బానిసయ్యాడు అని వర్తికర్ చెప్పారు. 

Also Read: Saturday Remedies: శనివారం నాడు ఈ 5 చిన్న పరిహారాలు చేస్తే.. శని దేవుడు మిమ్మల్ని ధనవంతులను చేస్తాడు!  

Also Read: Cheteshwar Puajra Century: 52 ఇన్నింగ్స్‌ల తర్వాత శతకం.. చతేశ్వర్‌ పుజారా కెరీర్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News