Saturday Remedies, Do these 5 small compensations on Saturday for Shani God: హిందూ శాస్రం ప్రకారం.. శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది. శనివారం రోజున శని దేవుడిని పూజించడంతో పాటు కొన్ని చర్యలు తీసుకుంటే.. శని అనుగ్రహం మీపై ఉంటుంది. శని అనుగ్రహం ఉన్న ఒక వ్యక్తి రాజుగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని న్యాయం మరియు కర్మఫలదాత అని పిలుస్తారు. మనుషులకు వారి కర్మలను బట్టి శని దేవుడు ఫలాలు ఇస్తాడు. శని దేవుని ఆశీస్సులు శని వారాలలో లభిస్తాయి. శని దేవుని అనుగ్రహం పొందడానికి కొన్ని పరిహారాలు తీసుకుంటే సరిపోతుంది. ఆ పరిహారాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.
శనివారం నాడు ఈ 5 పరిహారాలు చేయండి:
# మీరు చాలా కాలంగా కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కుని సతమతమవుతున్నట్లయితే.. శనివారం నాడు 11 రావి ఆకుల దండ తయారు చేయండి. శని దేవాలయానికి వెళ్లి.. శని దేవుడికి ఈ దండను సమర్పించండి. శని దేవుడికి మాల సమర్పించేటప్పుడు.. శని దేవుడి మంత్రాలను జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కోర్టు సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.
# శనివారం నాడు పచ్చి పత్తి దారంతో రావి చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ సమయంలో శని దేవుడిని ధ్యానిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీరు ప్రతి పనిలో పురోభివృద్ధి సాధిస్తారు. అడ్డంకులు కూడా తొలగిపోతాయి.
# మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటే.. రావి చెట్టుకు నల్ల నువ్వులను సమర్పించండి. ఆపై చెట్టుకు నీరు పోయండి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలు త్వరగా తొలగిపోతాయి.
# జ్యోతిష్యం ప్రకారం శనివారం ప్రవహించే నీటిలో నల్ల బొగ్గు పోయండి. ఆ సమయంలో 'శం శనిశ్చరాయ నమః' అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే ఉద్యోగం మరియు వ్యాపారంలో విజయం సాధిస్తారు. దీనితో పాటు ఆదాయం పెరుగుతుంది.
# శనివారం పుష్పా నక్షత్రంలో ఒక గ్లాసు నీరు తీసుకోండి. దానికి కొద్దిగా చక్కెర కలపండి. ఇప్పుడు ఈ నీటిని రావి చెట్టుకు సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
Also Read: BBL 2022: బిగ్‌బాష్ లీగ్‌లో పెను సంచలనం..15 పరుగులకే ఆలౌట్! స్టార్లున్నా కూడా అయిపాయె
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.