Google Pay New Rules: ఆన్‌లైన్ పేమెంట్స్ విషయంలో గూగుల్ కీలక ప్రకటన, అలా చేయకపోతే పేమెంట్ నిల్చిపోతుంది

Google Pay New Rules: గూగుల్ పే వినియోగదారులకు ఇది ఒక ముఖ్య గమనిక. గూగుల్ ఆధారిత పేమెంట్స్ విషయంలో గూగుల్ కొత్త విధానం జారీ చేస్తోంది. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఆ వివరాల్ని ఎంటర్ చేయాల్సిందేనంటోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 2, 2021, 11:40 AM IST
Google Pay New Rules: ఆన్‌లైన్ పేమెంట్స్ విషయంలో గూగుల్ కీలక ప్రకటన, అలా చేయకపోతే పేమెంట్ నిల్చిపోతుంది

Google Pay New Rules: గూగుల్ పే వినియోగదారులకు ఇది ఒక ముఖ్య గమనిక. గూగుల్ ఆధారిత పేమెంట్స్ విషయంలో గూగుల్ కొత్త విధానం జారీ చేస్తోంది. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఆ వివరాల్ని ఎంటర్ చేయాల్సిందేనంటోంది.

ఆన్‌లైన్ పేమెంట్స్ విధానంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త విధానం ప్రవేశపెట్టింది. కొన్ని రెగ్యులేషన్స్ తప్పనిసరి చేసింది. ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన కార్డు స్టోరేజ్‌ రెగ్యులేషన్స్‌ ప్రకారం వినియోగదారుడి కార్డు వివరాలు సేవ్ చేయకూడదు. ఈ రెగ్యులేషన్స్ ఆధారంగా గూగుల్ నూతన వివరాల్ని వెల్లడించింది. పేమెంట్‌ అగ్రిగ్రేటర్స్‌, పేమెంట్‌ గేట్‌వేస్‌ కోసం కొరకు ఆర్బీఐ(RBI) ఈ కొత్త మార్గదర్శకం జారీ చేసింది. ఆర్బీఐ విధివిధానాల ప్రకారం.. కార్డ్‌ జారీ చేసినవాళ్లు, సంబంధిత నెట్‌వర్స్క్‌ తప్ప ఇతర ప్లాట్‌ఫామ్స్‌ కార్డు వివరాల్ని సేకరించడానికి వీల్లేదు. 

అందుకే గూగుల్(Google) ముఖ్య గమనిక జారీ చేసింది. స్మార్ట్‌ఫోన్, ఇతర డివైజ్‌ల ద్వారా పేమెంట్లు చేసేవాళ్ల కార్డు వివరాల్ని గూగుల్ జనవరి 1, 2022 నుంచి సేవ్ చేయదు. ఆన్‌లైన్ పేమెంట్స్, క్రెడిట్ కార్డు, ఏటీఎం చెల్లింపులకు ఇది వర్తించనుంది. సాధారణంగా ఒకసారి పేమెంట్ చేసిన తరువాత మరోసారి చేసేటప్పుుడు కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ డేట్ వంటి వివరాలు ఆటోమేటిక్‌గా కన్పిస్తాయి.యూజర్ అవసరానికి అనుగుణంగా పేమెంట్ జరిగిపోతుంది కూడా. అయితే ఇకపై ఆ విధానం ఉండదు. గూగుల్ పే(Google pay), గూగుల్ వర్క్ అక్కౌంట్, గూగుల్ క్లౌడ్‌లో రికార్డైన వివరాలు ఇకపై పనిచేయవు. అందుకే కార్డు వినియోగించాలంటే ఎప్పటికప్పుడు పూర్తి వివరాల్ని రీ ఎంటర్ చేయాల్సిందేనని గూగుల్ తెలిపింది. లేకపోతే పేమెంట్లు క్యాన్సిల్ లేదా డిక్లైన్ అవుతాయి. 

వీసా లేదా మాస్టర్ కార్డు సంబంధిత డెబిట్ , క్రెడిట్ కార్డు పేమెంట్ల కోసం 2021 డిసెంబర్ 31 లోగా కార్డు వివరాల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పేమెంట్ చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక నుంచి కార్డుతో ఆన్‌లైన్ పేమెంట్స్(Online Payments) చేసేటప్పుడు యూజర్లు లేదా వినియోగదారులు తప్పనిసరిగా ఈ కొత్త విషయాలు గుర్తుంచుకోవల్సి ఉంటుంది. 

Also read: Moeen Ali Retention Reason: మొయిన్ అలీని చెన్నై సూపర్‌కింగ్స్ ఎందుకు రిటైన్ చేసుకుందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News